బెంగాల్‌లోకి ప్రవేశించిన జోడో న్యాయ్ యాత్ర: రాహుల్ ఆ రాష్ట్రానికి వెళ్లడం ఇదే తొలిసారి

by samatah |   ( Updated:2024-01-25 12:20:42.0  )
బెంగాల్‌లోకి ప్రవేశించిన జోడో న్యాయ్ యాత్ర: రాహుల్ ఆ రాష్ట్రానికి వెళ్లడం ఇదే తొలిసారి
X

దిశ, నేషనల్ బ్యూరో: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నేతృత్వంలో జరుగుతున్న భారత్ జోడో న్యాయ్ యాత్ర అసోం నుంచి గురువారం పశ్చిమ బెంగాల్‌లోకి ప్రవేశించింది. కుచ్ బెహార్ జిల్లాలోని బక్షీర్ హాట్ మీదుగా రాష్ట్రంలోకి చేరుకోగా..కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు అధిర్ రంజన్ చౌదరి అక్కడ రాహుల్‌కి స్వాగతం పలికారు. పార్లమెంటు ఎన్నికల్లో రాష్ట్రంలో ఒంటరిగా పోటీ చేస్తానని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) చీఫ్ మమతా బెనర్జీ ప్రకటించిన నేపథ్యంలో యాత్ర బెంగాల్‌లోకి ప్రవేశించడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో రెండు రోజుల పాటు యాత్ర కొనసాగనుంది. 2021 అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం తర్వాత రాహుల్ గాంధీ బెంగాల్‌కి వెళ్లడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని లెఫ్ట్ పార్టీలు యాత్రలో పాల్గొంటాయని కాంగ్రెస్ భావించింది. అయితే తమకు సమాచారం లేదనందున యాత్రకు దూరంగా ఉంటున్నట్టు టీఎంసీ ప్రకటించింది. ఇక ఇండియా కూటమిలో మిత్రపక్షమైన సీపీఎం యాత్రలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

అన్యాయానికి వ్యతిరేకంగా ‘ఇండియా’ పోరాటం

కూచ్ బెహార్ జిల్లాలోని ఖగ్రాబరీ చౌక్ వద్ద బహిరంగ సభలో రాహుల్ మాట్లాడారు. దేశ వ్యాప్తంగా జరుగుతున్న అన్యాయానికి వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి పోరాడుతుందని తెలిపారు. అందుకే యాత్రలో న్యాయ్ అనే పదాన్ని చేర్చినట్టు వెల్లడించారు. అంతకుముందు అసోంలో జరిగిన యాత్రలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో రాహుల్ సహా పలువరు నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Next Story

Most Viewed