ప్రధాని మోడీతో భేటి అయిన జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్

by Mahesh |   ( Updated:2024-07-15 11:53:29.0  )
ప్రధాని మోడీతో భేటి అయిన జార్ఖండ్‌ సీఎం హేమంత్ సోరెన్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల జైలు నుంచి విడుదలై జార్ఖండ్ సీఎంగా మరోసారి ప్రమాణం స్వీకారం చేసని హేమంత్‌ సోరెన్‌ ఈ రోజు ఢిల్లీలో ప్రధాని మోడీని భేటీ అయ్యారు. ఈ భేటీ ఇండియా కూటమిలో ఒక్కసారిగా అలజడి కలిగించగా.. సీఎం సోరెన్ మాత్రం మర్యాదపూర్వకంగానే కలిసినట్లు చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) ఎగ్జిక్యూటివ్ అధ్యక్షుడైన హేమంత్ సోరెన్ భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జనవరి 31న అరెస్టు అయ్యారు. కాగా అంతకు ముందే ఆయన తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. దాదాపు ఐదు నెలల జైలు జీవితం గడిపిన ఆయనకు బెయిల్ రాగా.. జూలై 4న జార్ఖండ్‌ సీఎంగా మరోసారి బాధ్యతలు స్వీకరించారు.

Advertisement

Next Story