ఈశాన్య భారతంలోకి ఎంట్రీ.. నితీష్ కుమార్ కీలక ప్రకటన

by Hajipasha |
ఈశాన్య భారతంలోకి ఎంట్రీ.. నితీష్ కుమార్ కీలక ప్రకటన
X

దిశ, నేషనల్ బ్యూరో : జనతా దళ్ యునైటెడ్ (జేడీయూ) విస్తరణపై నితీష్ కుమార్ ఫోకస్ పెట్టారు. ఈక్రమంలో ఈశాన్య రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లో ఒక లోక్‌సభ స్థానానికి పార్టీ అభ్యర్థి పేరును బుధవారం ప్రకటించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ జేడీయూ అధ్యక్షుడిగా ఉన్న రుహి తంగుంగ్.. అరుణాచల్ వెస్ట్ పీసీ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని ఓ ప్రకటనలో వెల్లడించారు. అరుణాచల్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని తెలిపారు. జేడీయూ జాతీయ అధ్యక్షుడిగా నితీష్ కుమార్ గత వారమే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

‘ఇండియా’ కన్వీనర్ పదవి రేసులోనూ..

విపక్ష కూటమి ‘ఇండియా’ కన్వీనర్ పదవి రేసులోనూ ఈయన పేరే ముందంజలో ఉందని జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో జాతీయ స్థాయి నిర్ణయాలపై నితీష్ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. ఇండియా కూటమి కన్వీనర్ పోస్టుకు నితీష్‌ను నిలబెట్టే ప్రతిపాదనకు సమాజ్‌వాదీ, ఆప్, ఆర్జేడీ, కాంగ్రెస్, డీఎంకే సహా పలు విపక్ష పార్టీలు ఇప్పటికే ఓకే చెప్పాయని తెలుస్తోంది. రెండు రోజుల్లో దీనిపై ఇండియా కూటమి నుంచి అధికారిక ప్రకటన వెలువడుతుందని అంటున్నారు.

Advertisement

Next Story

Most Viewed