JAYAPRADA: నాన్ బెయిలబుల్ వారెంట్‌ ఎఫెక్ట్.. ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన సినీనటి జయప్రద

by Shiva |
JAYAPRADA: నాన్ బెయిలబుల్ వారెంట్‌ ఎఫెక్ట్.. ఎట్టకేలకు కోర్టులో లొంగిపోయిన సినీనటి జయప్రద
X

దిశ, వెబ్‌డెస్క్: 2019 ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించిన కేసులో నిందితురాలిగా ఉన్న సీనియర్ నటి, బీజేపీ మాజీ ఎంపీ జయప్రద ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టులో ఇవాళ లొంగిపోయారు. కాగా, గత ఎన్నికల సమయంలో ఎలెక్షన్ కోడ్‌ను ఉల్లంఘించారంటూ జయప్రదపై ఎన్నికల అధికారులు ఆదేశాలతో పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలో విచారణకు హాజరు కావాలని కోర్టు పలుమార్లు జయప్రదను ఆదేశించింది. అయినా, కోర్టుకు హాజరుకాకపోవడంతో ఆమెపై చివరికి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. జనవరి 10నే కోర్టులో హాజరుపర్చాలని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. కానీ, ఆమె పరారీలో ఉండటంతో అది సాధ్యపడలేదు. దీంతో ఆమె స్వయంగా ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ కోర్టులో ఇవాళ లొంగిపోవడం ఆసక్తికరంగా మారింది. అయితే, తాజా పరిణామాలపై మరింత సమచారం ఇంకా తెలియాల్సి ఉంది.

👉 Download our Android App
👉Download our IOS App
👉Follow us on Instagram
👉 Follow us on whatsApp channel
👉 Follow us on Share chat

Next Story