అద్వానీకి భారత రత్న పై స్పందించిన జనసేనాని పవన్ కల్యాణ్

by Mahesh |   ( Updated:2024-02-04 14:40:02.0  )
అద్వానీకి భారత రత్న పై స్పందించిన జనసేనాని పవన్ కల్యాణ్
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ సీనియర్ రాజకీయ నాయకులు ఎల్ కే అద్వానీకి ఈ రోజు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారం అయిన భారత రత్న ను ప్రకటించింది. దీనిపై జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ స్పందించారు. ట్విట్టర్ ద్వారా లేఖ రూపంలో స్పందించిన ఆయన.. లేఖలో ఇలా తీసుకొచ్చారు. భారత రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్ని లిఖించుకున్న నాయకుడు మాజీ ఉప ప్రధానమంత్రి ఎల్‌కే అద్వానీకి భారత రత్న పురస్కారం రావడం.. సంతోషమని ఈ శుభసందర్బంగా నా తరఫున, జనసేన తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు.

అలాగే మెజారిటీ భారతీయులు మనోభావాలకు ప్రతీకగా నిలిచి ధృడ చిత్తంతో ఆయయన చేపట్టిన కార్యక్రమాలు మన దేశ రాజకీయాలను ఎంతో ప్రభావితం చేశారు. ఆయన పేరు వినగానే ఎవరికైన మొదట రథయాత్ర గుర్తుకు వస్తుంది.. అయోధ్యలో రామమందిర నిర్మాణం కోసం చేపట్టిన రథయాత్ర భారత పాలన వ్యవస్థలో కీలక మలుపు తీసుకొచ్చింది. భారత ఉప ప్రధానిగా, కేంద్ర మంత్రిగా, ప్రతిపక్ష నేతగా అద్వానీ ప్రజా పక్షం వహించి ఉత్తమ పార్లమెంటేరియన్ గా ఆయన నిలిచారని జనసేనాని పవన్ కల్యాణ్ తన లేఖలో రాసుకొచ్చారు.

Read More..

అయోధ్య ఉద్యమ రథసారథి అద్వానీకి శుభాకాంక్షలు: బండి సంజయ్

Advertisement

Next Story