- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Jammu Kashmir: రాష్ట్ర హోదానే మా ప్రధాన డిమాండ్.. ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ
దిశ, డైనమిక్ బ్యూరో: జమ్మూకాశ్మీర్ కు రాష్ట్ర హోదానే మా ప్రధాన డిమాండ్ అని, ఈ నినాదాన్ని వీధుల నుంచి పార్లమెంట్ వరకు తీసుకెళతామని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన తర్వాత జమ్మూ కాశ్మీర్ కి తొలిసారి ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. దీంతో ప్రధాన పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టాయి. ఈ నేపథ్యంలోనే బుధవారం కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించారు. ఈ సందర్భంగా అనంతనాగ్, రాంబన్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మీటింగ్ లో మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదాపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన మాట్లాడుతూ.. భారతదేశ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర హోదాను తొలగించి కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారని తెలిపారు. బీజేపీ ఇవాళ జమ్మూ కాశ్మీర్‌ను బయటి నుండి 'రాచరికం' నడుపుతోందని, ఇక్కడ సంపద, అవకాశాలు, ఉద్యోగాలు కాశ్మీరీలకు కాకుండా బయటి వారికి ఇస్తున్నారని ఆరోపించారు. ఇలా జరగడాన్ని మేము అస్సలు అనుమతించమని చెప్పారు. జమ్మూ కాశ్మీర్‌లో భారత జనబంధన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తోందని, మేము వీధుల నుండి అసెంబ్లీ వరకు, అసెంబ్లీ నుండి పార్లమెంటు వరకు పూర్తి శక్తితో రాష్ట్ర హోదా కోసం డిమాండ్‌ను లేవనెత్తామని స్పష్టం చేశారు. బీజేపీ ఏమి చేసినా, ఇండియా కూటమి మీకు రాష్ట్ర హోదాతో పాటు మీ గౌరవం, మీ హక్కులను పొందేలా చేస్తుందని తాను గ్యారెంటీ ఇస్తున్నానని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.