- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
2029లోనే జమిలీ ఎన్నికలు!: రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక
దిశ, నేషనల్ బ్యూరో: ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’పై అధ్యయనానికి కేంద్ర ప్రభుత్వం నియమించిన మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు అందజేసింది.18,626 పేజీల రిపోర్టును రాష్ట్రపతి భవన్‌లో ముర్ముకు సమర్పించింది. ఇతర కమిటీ సభ్యులు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రాజ్యసభలో మాజీ ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, 15వ ఆర్థిక సంఘం చైర్మన్ ఎన్‌కే సింగ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ సీ. కశ్యప్‌లు కూడా పాల్గొన్నారు. సుమారు 191 రోజుల పాటు అనేక మంది నిపుణులతో ఈ కమిటీ చర్చలు జరిపింది. రాజకీయ పార్టీల అభిప్రాయాలు సైతం సేకరించింది. సుధీర్ఘ సంప్రదింపుల అనంతరం నివేదికను రూపొందించింది.
కమిటీ సిఫార్సులివే?
కోవింద్ కమిటీ ప్రతిపాదనలను ఇంకా బహిర్గతం చేయనప్పటికీ..పలు నివేదికల ప్రకారం..2029లో దేశంలో ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని కోవింద్ కమిటీ సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. అయితే ముందుగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత రెండో దశలో 100 రోజుల్లోగా స్థానిక సంస్థల ఎలక్షన్స్ నిర్వహించాలని ప్యానెల్ సిఫారసు చేసినట్టు సమాచారం. దీనికి సంబంధించిన పలు సమస్యలను కూడా కమిటీ సూచించినట్టు తెలుస్తోంది. ఈ ఎన్నికల నిర్వహణకు రాజ్యాంగ సవరణ చేసేందుకు కూడా అవకాశం ఉందని కమిటీ భావిస్తోంది. ఒకే ఒటర్ ఐడీ కార్డును జారీ చేయాలని కూడా కమిటీ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. అయితే జమిలీ ఎన్నికలు అమలు చేయడానికి, అనేక రాష్ట్రాల అసెంబ్లీల పదవీకాలం తగ్గనుండగా..మరికొన్ని రాష్ట్రాల పదవీకాలం పొడిగించే చాన్స్ ఉంది. లా కమిషన్ సిఫార్సులను కూడా పరిశీలించాక దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్టు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
కాగా, గతేడాది సెప్టెంబర్ 2న కోవింద్ కమిటీని కేంద్రం నియమించింది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా, మాజీ ఎంపీ గులాం నబీ ఆజాద్ సహా 8 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ ప్రత్యేక సభ్యునిగా నియమితులయ్యారు. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ మొదటి సమావేశం 2023 సెప్టెంబర్ 23న ఢిల్లీలోని జోధ్‌పూర్ ఆఫీసర్స్ హాస్టల్‌లో జరిగింది. 191 రోజుల పాటు అధ్యయనం చేసి నివేదికను రూపొందించింది. లోక్‌సభ ఎన్నికల తర్వాత ఈ నివేదిక కేబినెట్ ముందుకు రానుంది.