- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పాకిస్థాన్ లో పర్యటించనున్న జైశంకర్
దిశ, వెబ్ డెస్క్ : భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పాకిస్థాన్ లో పర్యటించనున్నారు. ఇస్లామాబాద్ లో జరగనున్న షాంఘై సహకార సంఘం(SCO) వార్షిక సమావేశానికి జైశంకర్ హాజరు కానున్నారు. సదస్సులో పాల్గొనేందుకు జైశంకర్ మంగళవారం ఇస్లామాబాద్ వెళ్లనున్నారు. ఈ సదస్సు అనంతరం పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఇచ్చే విందులో మంత్రి పాల్గొంటారు. అనంతరం తిరిగి భారత్ కు వస్తారు. అయితే ఈ ఏడాది SCO సదస్సు పాక్ అతిధ్యం ఇస్తోంది. ఇందులో భాగంగా భారత్ కు రెండు నెలల కిందనే ఆహ్వానం అందగా.. సదస్సుకు విదేశాంగ మంత్రి హాజరవనున్నట్టు భారత్ సమాచారం ఇచ్చింది. ఈ సమావేశంలో చైనా, రష్యా ప్రధానులు కూడా పాల్గొంటారు. ఈ మొత్తం సమావేశంలో ఎక్కడ కూడా భారత్-పాక్ ద్వైపాక్షిక చర్చలు ఉండవని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. కాగా 2015లో నాటి విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆఫ్ఘనిస్తాన్ ఏర్పాటు చేసిన సదస్సు నిమిత్తం పాక్ పర్యటన చేయగా.. తొమ్మిదేళ్ల అనంతరం మళ్ళీ భారత విదేశాంగ మంత్రి పర్యటించడం ఇదే తొలిసారి.