తూర్పు ఆసియా సమ్మిట్ లో జైశంకర్ కీలక వ్యాఖ్యలు

by Shamantha N |
తూర్పు ఆసియా సమ్మిట్ లో జైశంకర్ కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి నెలకొల్పేందుకు దక్షిణ చైనా గుండా వెళ్తున్న సముద్ర మార్గాలు కీలకమైనవని విదేశాంగమంత్రి ఎస్ జైశంకర్ అన్నారు. లావోస్ రాజధాని వియంటియాన్‌లో జరిగిన 14వ తూర్పు ఆసియా సమ్మిట్ (EAS) విదేశాంగ మంత్రుల సమావేశంలో జైశంకర్ ప్రసంగించారు. ఈఏఎస్ ఏర్పడి ఈ ఏడాదికి రెండు దశాబ్దాలు పూర్తయిందని హర్షం వ్యక్తం చేశారు. బలమైన ఈఏఎస్ ఏర్పాటుకు భారత్ దోహదపడుతుందన్నారు.

సముద్ర భద్రతపై ఏమన్నారంటే?

సముద్ర భద్రత గురించి మాట్లాడుతూ.. "దక్షిణ చైనా సముద్రం గుండా వెళుతున్న సీ లైన్స్ ఆఫ్ కమ్యూనికేషన్ (SLOC).. ఇండో-పసిఫిక్ ప్రాంత శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు, అభివృద్ధికి కీలకమైనవి. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా, వాస్తవికంగా, ప్రభావవంతంగా ప్రవర్తనా నియమావళి ఉండాలి. చర్చల్లో పాల్గొనని దేశాల చట్టబద్ధమైన హక్కులు, ప్రయోజనాలకోసం పక్షపాతంగా వ్యవహరించవద్దు” అని అన్నారు. ఉక్రెయిన్ వివాదాన్ని పరిష్కరించేందుకు భారత్ అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉందన్నారు. గాజాలో సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు సంబంధిత పక్షాలు కృషి చేయాలని సంయమనం పాటించాలని సూచించారు. మరోవైపు, చైనా ప్రధాని వాంగ్ యి కూడా వియంటైన్‌లో ఉన్నారు, కాగా.. దక్షిణ చైనా సముద్రం గురించి జైశంకర్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

Advertisement

Next Story

Most Viewed