- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
20 ఏళ్ల క్రితం కూడా ఇదే జరిగింది: జైరాం రమేష్
న్యూఢిల్లీ: కీలక మూడు హిందీ రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమిపై కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ స్పందించారు. 20 ఏళ్ల క్రితం కూడా ఇదే జరిగిందని, ఆ సమయంలో తాము ఢిల్లీలో మాత్రమే గెలిచామన్నారు. అయితే, ఆ తర్వాత కొన్ని నెలలకే 2004 లోక్‌సభ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా నిలిచి కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పుడు కూడా ఇదే జరుగుతుందని, 2024 సార్వత్రిక ఎన్నికల్లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఆదివారం వచ్చిన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాల్లో బీజేపీ మూడింట్లో విజయం సాధించగా, తెలంగాణలో మాత్రమే కాంగ్రెస్ స్పష్టమైన మెజారిటీ సాధించింది. ఈ నేపథ్యంలో ఇండియా కూటమి ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించాలని భావిస్తున్న కాంగ్రెస్‌కు ఇది గట్టి ఎదురుదెబ్బగా ఉండనుంది. కానీ, ఈ ఫలితాలు 2024 లోక్‌సభ ఎన్నికలపై ఉండదని కాంగ్రెస్ నుంచి ఎక్కువ వినిపిస్తోంది.