- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్ సమావేశాలకు రాహుల్ గాంధీ!.. ఆనందంలో కాంగ్రెస్ శ్రేణులు
దిశ, వెబ్ డెస్క్: మోడీ ఇంటిపేరు వ్యవహారంలో కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ తన ఎంపీ పదవిని కోల్పోయారు. అయితే ఈ కేసులో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాజాగా రాహుల్ గాంధీపై మోపిన పరువు నష్టం కేసులో స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు వెలువరించింది. దీంతో రాహుల్ గాంధీ ఎంపీ తన పదవిని తిరిగి పొందనున్నారు. దీనికి సంబంధించిన ఉత్తర్వులు లోక్ సభ సెక్రటేరియట్ నుంచి రేపో మాపో రానున్నాయి.
ఇక ఆ ఉత్తర్వులు రాగానే రాహుల్ గాంధీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలకు హాజరవుతారని కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ లో జరుగుతున్న పలు అంశాలకు సంబంధించిన చర్చల్లో ఆయన పాల్గొంటారని తెలిపాయి. కాగా మోడీ ఇంటిపేరు వ్యవహారంలో దాఖలైన పరువు నష్టం కేసులో రాహుల్ ను దోషిగా తేలుస్తూ గుజరాత్ లోని సూరత్ కోర్టు ఆయనకు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన లోక్ సభ సభ్యత్వాన్ని కోల్పోయారు.