Sunita Williams : సునీతా విలియమ్స్ ఇక అంతరిక్షంలోనేనా!

by D.Reddy |   ( Updated:2025-03-05 10:24:34.0  )
Sunita Williams : సునీతా విలియమ్స్ ఇక అంతరిక్షంలోనేనా!
X

దిశ, వెబ్ డెస్క్ : అంతరిక్షంలోకి వెళ్ళిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్(Sunita Williams) ఇక అంతరిక్షకేంద్రంలోనే ఉండనున్నారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. మూడోసారి అంతరిక్షంలోకి వెళ్ళిన సునీతా వారం రోజుల్లోనే వెనక్కి రావాల్సి ఉండగా.. దాదాపు 9 నెలలు గడుస్తున్నా ఆమెను వెనక్కి తీసుకు వచ్చే సూచనలు ఇప్పట్లో కనిపించడం లేదు. అయితే మార్చ్ 12న మరికొంతమంది వ్యోమగాములతో అంతరిక్షంలోకి వెళ్ళే స్పేస్ షిప్ లో సునీతా, ఆమెతోపాటు వెళ్ళిన బచ్ విల్మోర్(Butch Wilmore) లు భూమి మీదకి వస్తారనే ప్రచారం జరిగింది. తాజాగా సునీతా ఇచ్చిన స్టేట్మెంట్ చూస్తే.. వారు ఇప్పుడిప్పట్లో భూమి మీదకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ అని తెలుస్తోంది. తాము భూమి మీదకి ఎప్పుడు తిరిగి వచ్చేది చెప్పడం చాలా కష్టం అని, సుదీర్ఘంగా అంతరిక్షంలో ఉండటం వలన వ్యక్తం అవుతున్న ఆందోళనలు అనవసరమైనవే అయినప్పటికీ ప్రజలు ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకోవడాన్ని తాము అర్థం చేసుకోగలమని తెలిపారు.

2030లో అంతరిక్ష కేంద్రం(ISS) జీవిత కాలం పూర్తి కానున్న నేపథ్యంలో.. దానిని స్పేస్ నుంచి తప్పించే పనులు ముమ్మరంగా చేస్తోంది నాసా(NASA). ప్రస్తుతం అందుకు సంబంధించిన కీలక పనులు జరుగుతున్నాయని, అందువలన తాము భూమి మీదకి రావడానికి మరికొంత సమయం పట్టవచ్చని వారు పేర్కొన్నారు. అయితే సునీతా విలియమ్స్, బచ్ విల్మోర్ లను భూమి మీదకి తీసుకురావడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump).. ఎలాన్ మస్క్(Elan Musk) కు చెందిన స్పేస్ ఎక్స్(SpaceX) సహాయం కోరారు. దీనిపై స్పందించిన మస్క్ వారిని భూమి మీదకి సురక్షితంగా తీసుకు వచ్చేందుకు కొంత సమయం కావాలని అన్నారు. అప్పటి నుంచి నాసా, స్పేస్ ఎక్స్ తో కలిసి పని చేస్తోంది.

Read More : Sunita Williams: మేం భూమి మీదకు ఎప్పుడు వస్తామో కచ్చితంగా తెలియదు- సునితా విలియమ్స్

Next Story

Most Viewed