Justin Trudeau: భారత్‌ ఆరోపణలు తప్పు.. ఉగ్రవాదంపై మేం మెతకగా ఉండం : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో

by Vinod kumar |   ( Updated:2023-07-06 12:04:46.0  )
Justin Trudeau: భారత్‌ ఆరోపణలు తప్పు.. ఉగ్రవాదంపై మేం మెతకగా ఉండం : కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో
X

ఒట్టావా (కెనడా) : ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే ఖలిస్థానీ తీవ్రవాదులకు నిరసన తెలిపే అవకాశాన్ని కెనడా కల్పిస్తోందంటూ భారత్ చేసిన ఆరోపణలను ఆ దేశ ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఖండించారు. భారత్‌ చేస్తున్న ఆరోపణలు తప్పు అని ఆయన గురువారం స్పష్టం చేశారు. హింసను కెనడా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. ఉగ్రవాదంపై తాము ప్రతిసారి కఠిన చర్యలు తీసుకున్నామని, అదే తీరును ఇకపైనా కొనసాగిస్తామని వెల్లడించారు. "కెనడా వైవిధ్యభరిత దేశం. ఇక్కడ భావప్రకటనా స్వేచ్ఛ ఉంది.

కానీ, ఉగ్రవాదంపై మెతక వైఖరి ఉండదు" అని తెలిపారు. జులై 8న కెనడాలోని టొరంటోలో ‘ఖలిస్థాన్‌ ఫ్రీడం ర్యాలీ’ నిర్వహిస్తామంటూ ఏర్పాటైన పోస్టర్లపై భారత్ ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. ఆ పోస్టర్లపై కెనడాలోని భారత రాయబార కార్యాలయం అధికారుల ఫోటోలను ప్రింట్ చేసి, వారిని హంతకులకు పేర్కొనడంపై అభ్యంతరం తెలిపింది. దీనిపై స్పందిస్తూనే ఇప్పుడు ట్రూడో ఈ వ్యాఖ్యలు చేశారు.

Advertisement

Next Story

Most Viewed