కేజ్రీవాల్ అరెస్టుపై విచారణ..సీబీఐకి హైకోర్టు నోటీసులు

by vinod kumar |
కేజ్రీవాల్ అరెస్టుపై విచారణ..సీబీఐకి హైకోర్టు నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై మంగళవారం జస్టిస్ నీనా బన్సల్ కృష్ణతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. కేజ్రీవాల్ ఇప్పటికే జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నందున అరెస్టు అవసరం లేదని, తగిన కారణాలను వెల్లడించకుండానే అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. సీబీఐ ఎఫ్‌ఐఆర్ ఆగస్టు 2022లో నమోదు చేసిందని, గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారని కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం సీబీఐకి నోటీసులు జారీ చేసింది.7 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈనెల 17కు వాయిదా వేసింది. కాగా, మద్యం పాలసీ కేసులో గత నెల 26న కేజ్రీవాల్ ను సీబీఐ అరెస్టు చేసింది. ప్రస్తుతం ఆయన జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

Next Story