- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తిహార్ జైలులో కేజ్రీవాల్‌కు ఇన్సులిన్.. విజయం సాధించామన్న ఆప్
దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తిహార్ జైలులో ఉన్న సీఎం కేజ్రీవాల్‌కు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) వెల్లడించింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో పోస్టు చేసింది.‘కేజ్రీవాల్ షుగర్ లెవల్ ప్రస్తుతం 320కి చేరుకుంది. చివరికి బీజేపీ, జైలు అధికారులు తేరుకుని కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అందించారు. ఢిల్లీ ప్రజల పోరాటం వల్లే ఇది సాధ్యమైంది. కేజ్రీవాల్‌కు ఇన్సులిన్ అందించడంలో విజయం సాధించాం’ అని పేర్కొంది. పదేపదే అభ్యర్థనలు చేసినప్పటికీ తిహార్ జైలు అధికారులు తనకు ఇన్సులిన్ అందించడం లేదని కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే షుగర్ లెవల్స్ ఎక్కువ కావడంతో ఇన్సులిన్ అందజేసినట్టు తెలుస్తోంది.
అరవింద్ కేజ్రీవాల్‌కు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి ఇన్సులిన్ అవసరమా అని నిర్ధారించడానికి మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని ఢిల్లీ కోర్టు ఎయిమ్స్‌ని ఆదేశించిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం జరిగడం గమనార్హం. మరోవైపు కేజ్రీవాల్ కస్టడీపై రౌస్ అవెన్యూ కోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. కేజ్రీవాల్‌ను ఏప్రిల్ 1 నుంచి15 వరకు జ్యుడీషియల్ కస్టడీకి పంపింది. ఆ తర్వాత అతని కస్టడీని ఏప్రిల్ 23 వరకు పొడిగించిన విషయం తెలిసిందే.