ముంబైకి చేరిన ఐఎన్ఎస్ కోల్‌కతా: 35 మంది సముద్రపు దొంగలు అప్పగింత

by samatah |
ముంబైకి చేరిన ఐఎన్ఎస్ కోల్‌కతా: 35 మంది సముద్రపు దొంగలు అప్పగింత
X

దిశ, నేషనల్ బ్యూరో: సోమాలియా తీరంలో పట్టుబడిన 35 మంది సముద్రపు దొంగలతో కూడిన యుద్ధనౌక ఐఎన్ఎస్ కోల్‌కతా శనివారం ముంబైకి చేరుకున్నట్టు ఇండియన్ నేవీ తెలిపింది. తదనంతరం తాము పట్టుకున్న సముద్రపు దొంగలందరినీ ముంబై పోలీసులకు అప్పగించినట్టు పేర్కొంది. అరేబియా సముద్రం, గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా వాణిజ్య నౌకలకు ఆటంకాలు కలగకుండా సహాయక చర్యలు చేపట్టేందుకు ఇండియన్ నేవీ ‘ఆపరేషన్ సంకల్ప్’ చేపట్టింది. భారత నావికాదళం పలు నౌకలను మోహరించింది. ఈ నేపథ్యంలోనే గతేడాది సముద్రపు దొంగలు హైజాక్ చేసిన ఎంవీ రుయెన్ అనే నౌకను ఈ నెల 15న 40గంటల పాటు ఆపరేషన్ చేపట్టి ఐఎన్ఎస్ కోల్‌కతా రక్షించింది. అందులోని 35 మంది సముద్రపు దొంగలను బంధించింది. ఈ క్రమంలోనే వారిని ముంబైకి తరలించి పోలీసులకు అప్పగించింది. ఈ ఆపరేషన్‌కు ఐఎన్ఎస్ సుభద్ర కూడా ఉపయోగపడింది. అంతేగాక P8I విమానం, సీ గార్డియన్ యూఏవీ, పలు ఆధునిక డ్రోన్లను సైతం నేవీ ఉపయోగించింది.

Advertisement

Next Story

Most Viewed