- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
INS Brahmaputra : ‘ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర’లో మంటలు.. నావికుడు గల్లంతు
దిశ, నేషనల్ బ్యూరో : భారత నౌకాదళానికి చెందిన ‘ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర’ ఫ్రిగేట్‌లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. సోమవారం ఉదయం ముంబైలోని నేవల్ డాక్‌యార్డ్‌లో ఈఘటన చోటుచేసుకుంది. ‘ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర’కు మరమ్మతులు చేస్తుండగా మంటలు చెలరేగాయి. దీంతో డాక్‌యార్డ్‌లోని అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలు ఆర్పారు. అక్కడే ఉన్న ఇతర నౌకలు కూడా మంటలు ఆర్పేందుకు తమవంతుగా సహకరించాయి. ఆ తర్వాత ‘ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర’ను తనిఖీ చేయగా..అందులోని ఒక జూనియర్ నావికుడి ఆచూకీ గల్లంతైంది. రెస్క్యూ టీమ్స్ అతడి ఆచూకీ కోసం గాలిస్తున్నాయి.
మంటలు ఎందుకు చెలరేగాయి ? ఫ్రిగేట్‌లోని ఏవైనా వస్తువులు, పదార్థాల వల్ల మంటలు అలుముకున్నాయా ? అనేది తెలుసుకునేందుకు ‘ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర’ను అణువణువూ జల్లెడ పట్టారు. ‘‘మంటలు చెలరేగిన తర్వాత ఐఎన్‌ఎస్ బ్రహ్మపుత్ర ఫ్రిగేట్ బ్యాలెన్స్‌ను కోల్పోయి ఒక వైపునకు వంగిపోయింది. డాక్‌యార్డ్‌లోని సిబ్బంది ఎంత ప్రయత్నించినా అది సరైన పొజిషన్‌లోకి రాలేదు. ప్రస్తుతం అది ఓ వైపునకు వంగిపోయిన పొజిషన్‌లోనే ఉంది’’ అని నౌకాదళం తెలిపింది. ఈ ప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించినట్లు వెల్లడించింది.