యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం

by S Gopi |
యూసీసీ బిల్లుపై ఉత్తరాఖండ్ అసెంబ్లీలో ప్రతిపక్షాల ప్రశ్నల వర్షం
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుపై తిరిగి చర్చను ప్రారంభించింది. ఈ చట్టాన్ని సెలెక్షన్ కమిటీకి రిఫర్ చేయాలని ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యులు ప్రతిపాదించారు. యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ) బిల్లును తాము వ్యతిరేకించడంలేదని, అయితే, అందులోని నిబంధనలను వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, ఆమోదానికి ముందు అందులో ఉన్న లోపాలను సరిద్దాలని ప్రతిపక్ష శాసనసభ్యులు చెప్పారు. ప్రతిపాది బిల్లులో లివ్-ఇన్ రిలేషన్‌షిప్ రిజిస్ట్రేషన్, 21 ఏళ్లలోపు లివ్-ఇన్ పార్ట్‌నర్ల తల్లిదండ్రులకు తెలియజేయడం వంటి నిబంధనలు యువత గోప్యతకు భంగం కలిగిస్తాయని అసెంబ్లీలో ప్రతిపక్ష నేత భువన్ చంద్ర కాప్రి అన్నారు. వివాహాన్ని తప్పనిసరిగా రిజిస్టర్ చేయడం, బాల్య వివాహాలపై నిషేధం, కనీస వివాహ వయసు లాంటి అనేక నిబంధనలు ఉన్నాయని, వాటి గురించి కొత్తగా ఏమీ లేదన్నారు. యూసీసీ ముసాయిదాను సిద్ధం చేసేందుకు 20 నెలల సమయం తీసుకున్న ప్యానెల్, ఇప్పటికే అమల్లో ఉన్న చట్టాలను కట్, కాపీ, పేస్ట్ మాత్రమే చేశాయన్నారు. యూసీసీ బిల్లు ముస్లింల మతపరమైన హక్కులను కాలరాస్తోందని లక్సర్ ఎమ్మెల్యే షాజాద్ ఆరోపణలు చేశారు. తల్లిదండ్రుల ఆస్తిలో కుమారులు, కుమార్తెలకు సమాన వారసత్వ హక్కుల వల్ల ఆడపిల్లల భ్రూణహత్యలు పెరిగేందుకు దారితీస్తాయన్నారు. చక్రతా ఎమ్మెల్యే ప్రీతమ్ సింగ్, రాష్ట్రం వెలుపల నివశించే ఉత్తరాఖండ్ నుంచి వచ్చిన ప్రజలకు దాని నిబంధనలు వర్తిస్తాయని చట్టంలో ఉంది. అదెలా జరుగుతుందని ప్రశ్నించారు.

Advertisement

Next Story