త్వరలో 'మత్స్య-6000' మానవసహిత సబ్‌మెర్సిబుల్ వెహికల్ రెడీ..

by Vinod kumar |   ( Updated:2023-06-08 13:19:40.0  )
త్వరలో మత్స్య-6000 మానవసహిత సబ్‌మెర్సిబుల్ వెహికల్ రెడీ..
X

న్యూఢిల్లీ: సముద్రయాన్ ప్రాజెక్ట్ కింద మానవ సహిత సబ్‌ మెర్సిబుల్ వాహనాన్ని సముద్రంలో 6,000 మీటర్ల లోతుకు పంపే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. ఈ సబ్‌ మెర్సిబుల్ వాహనం త్వరలో అందుబాటులోకి వస్తుందని, దీని ద్వారా ముగ్గురిని సముద్ర గర్భంలోకి పంపుతామని కేంద్ర భూ శాస్త్రాల శాఖ మంత్రి కిరెన్ రిజిజు వెల్లడించారు.

నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ (NIOT)లో జరిగిన ప్రపంచ మహాసముద్ర దినోత్సవాల్లో ఆయన ఈవివరాలను తెలిపారు. టైటానియం మెటల్‌తో తయారు చేసిన సబ్‌ మెర్సిబుల్ వాహనానికి "మత్స్య-6000" అని పేరు పెట్టామన్నారు. ఇక సముద్రయాన్ ప్రాజెక్ట్‌లోని మానవ రహిత మిషన్‌లో భాగంగా సముద్రంలో 7,000 మీటర్ల లోతుదాకా వెళ్లగలిగామన్నారు.

Advertisement

Next Story

Most Viewed