నదుల్లో పెరిగిన నీటిమట్టం.. గతేడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా..

by Shamantha N |
నదుల్లో పెరిగిన నీటిమట్టం.. గతేడాది సెప్టెంబర్ తర్వాత తొలిసారిగా..
X

దిశ, నేషనల్ బ్యూరో: దేశవ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. దేశంలోని ప్రధాన జలాశయాల నీటిమట్టం గతేడాది సెప్టెంబర్ నుంచి తొలిసారిగా పెరిగిందని సెంట్రల్ వాటర్ కమిషన్(సీడబ్లూసీ) తెలిపింది. గతవారం కంటే నీటి మట్టం 2 శాతం పెరిగందని తెలిపింది. ప్రస్తుతం నిల్వసామర్థ్యం 73 శాతంగా ఉందని వెల్లడించింది. 150 రిజర్వాయర్లలో 20 జలవిద్యుత్ ప్రాజెక్టులు ఉన్నాయని తెలిపింది. ఈ రిజర్వాయర్లలో 22 శాతం నీరు ఉందని సీడబ్ల్యూసీ తెలిపింది. నివేదిక ప్రకారం.. గతేడాదితో పోలిస్తే 56 రిజర్వాయర్లలో నీటి నిల్వ స్థాయిలు అధికంగా ఉన్నాయి. మరో 61 రిజర్వాయర్లలో సాధారణ నిల్వల కంటే అధికంగా ఉన్నాయంది. మరో, 14 రిజర్వాయర్లలో 20 శాతం కంటే తక్కువ నిల్వలు ఉన్నట్లు వెల్లడించింది. మరో 8 రిజర్వాయర్లయలో సాధారణం కన్నా తక్కువగా నీటి నిల్వ ఉన్నట్లు తెలిపింది. అసోం, జార్ఖండ్, త్రిపుర, నాగాలాండ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటక, కేరళలోని రిజర్వాయర్లలో గతేడాది కంటే మెరుగైన నీటి నిల్వలు ఉన్నాయంది. రాజస్థాన్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, బిహార్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని రిజర్వాయర్లలో గతేడాది కన్నా తక్కువగా నీటి నిల్వలు ఉన్నట్లు పేర్కొంది.

Advertisement

Next Story