- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Indian Researcher: హమాస్‌తో సంబంధాల ఆరోపణలపై యూఎస్‌లో భారతీయ విద్యార్థి అరెస్ట్

దిశ, నేషనల్ బ్యూరో: అమెరికాలో జార్జ్‌టౌన్ విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ పరిశోధక విద్యార్థిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అరెస్టు చేశారు. పాలస్తీనా ఉగ్రవాద సంస్థ హమాస్‌తో సంబంధాలు ఉన్నాయనే ఆరోపణల నేపథ్యంలో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. స్టూడెంట్ వీసాపై ఉన్న బదర్ ఖాన్ సూరిని డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ఏజెంట్లు కలిసి నోటీసులు ఇచ్చారు. ప్రభుత్వం తన వీసాను రద్దు చేసిందని చెప్పి అదుపులోకి తీసుకున్నట్టు విద్యార్థి లాయర్ తెలిపారు. యూనివర్శిటీలో సూరి హమాస్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తున్నాడని, హమాస్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్నట్టు హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ గుర్తించిందని స్థానిక మీడియా పేర్కొంది. హమాస్ ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నాడని ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆరోపించారు. హమాస్‌కు సీనియర్ సలహాదారుగా ఉన్న ఉగ్రవాదితో సూరి సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నాడని హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ ప్రతినిధి పేర్కొన్నారు. దీనిపై బదర్ ఖాన్ సూరి ఇమిగ్రేషన్ కోర్టును ఆశ్రయించాడు. తనకు ఎటువంటి నేర చరిత్ర లేదని, తన భార్యకు పాలస్తీనా మూలాలు ఉన్న కారణంతో తనపై తప్పుడు ఆరోపణలు చేశారని కోర్టుకు తెలియజేశాడు. జార్జ్‌టౌన్ యూనివర్శిటీలో పోస్ట్‌డాక్టోరల్ అసోసియేట్‌గా ఉన్న సూరి 'ఇరాక్, ఆఫ్ఘనిస్తాన్‌లలో శాంతి స్థాపనపై తన డాక్టోరల్ పరిశోధనను కోసం వీసా తీసుకున్నాడు.