- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ రైలును ప్రవేశపెట్టనున్న కేంద్రం
న్యూఢిల్లీ: భారత రైల్వే మరో నూతన అవిష్కరణ చేసింది. రాష్ట్ర పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు భారత్ గౌరవ్ డీలక్స్ ఏసీ టూరిస్ట్ ట్రెయిన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్రత్యేక రైలును ఐఆర్ సీటీసీ నిర్వహించనుండగా, ఈ నెల 28 నుంచి సేవలు అందించనుంది. 8 రోజుల పాటు టూర్ అందిస్తున్నట్లు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. గురుగ్రాం, రేవరి, రింగాస్, ఫుల్లార్, ఐమర్ స్టేషన్లలో పర్యాటకులకు అందుబాటులో ఉండనుంది.
స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ నుంచి స్ఫూర్తి పొంది 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' పథకం ద్వారా టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వెల్లడించారు. మొత్తం రైలు 8 రోజుల్లో సుమారుగా 3500 కిలోమీటర్ల దూరం ప్రయాణించనుంది. ఈ జర్నీలో స్టాట్యూ ఆఫ్ యూనిటీ విగ్రహాన్ని కూడా కవర్ చేయడమే కాకుండా, ప్రపంచ గుర్తింపు పొందిన పర్యాటక ప్రదేశాలు, అక్షర్‌ధాం ఆలయం, సబర్మతి ఆశ్రమం, మోధెరా సూర్య దేవాలయం, రాణి కి వావ్ వంటి చారిత్రాత్మక ప్రదేశాల గుండా యాత్ర సాగనుంది. కాగా, ఈ టూర్ కు ధరలు రూ.50 వేల నుంచి రూ.80 వేల మధ్యలో ఉండనున్నాయి.