మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ ఆ దేశానిదే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?

by Vinod kumar |
మోస్ట్ పవర్ ఫుల్ పాస్‌పోర్ట్ ఆ దేశానిదే.. ఇండియా ర్యాంక్ ఎంతంటే..?
X

న్యూఢిల్లీ : భారతీయ పాస్‌ పోర్ట్ ర్యాంక్ మెరుగుపడింది. “హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2023” ప్రకారం.. మన దేశపు పాస్‌పోర్ట్ ర్యాంక్ 87 నుంచి 80కి చేరింది. వీసా లేకుండానే మన పాస్‌ పోర్ట్‌తో 57 గమ్య స్థానాలకు ఉచితంగా ప్రయాణం చేయొచ్చు. టోగో, సెనెగల్‌ దేశాల పాస్‌ పోర్ట్‌లు కూడా ఈ ఇండెక్స్‌లో ఇండియాతో పాటు 80వ స్థానంలోనే నిలవడం గమనార్హం. ఈ ఇండెక్స్‌లో సింగపూర్ పాస్ పోర్ట్ టాప్ ప్లేస్‌లో నిలిచింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన పాస్‌ పోర్ట్ టైటిల్‌ను సింగపూర్ పాస్ పోర్ట్ దక్కించుకుంది. ప్రపంచంలో పాస్ పోర్ట్ ద్వారా జర్నీ చేసే ఎయిర్ ట్రావెల్ డెస్టినేషన్స్‌ మొత్తం 227 ఉన్నాయి. సింగపూర్ పాస్ పోర్ట్ ఉంటే వాటిలో 192 ఎయిర్ ట్రావెల్ డెస్టినేషన్స్‌‌కు వీసా లేకుండానే వెళ్లొచ్చు.

ఇక రెండో ప్లేస్‌లో జర్మనీ, ఇటలీ, స్పెయిన్ ఉన్నాయి. ఈ దేశాల పాస్ పోర్ట్‌లతో 190 గమ్యస్థానాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. గత ఐదేళ్లలో మొదటిసారిగా.. పవర్ ఫుల్ పాస్ పోర్ట్ ర్యాంక్‌ను జపాన్ కోల్పోయింది. ఇప్పుడు దాని ర్యాంకు మూడో స్థానానికి చేరింది. జపాన్ పాస్‌ పోర్ట్‌తో 189 గమ్యస్థానాలకు వీసా లేకుండా జర్నీ చేయొచ్చు. ఈ ఇండెక్స్‌లో పదేళ్ల క్రితం అగ్రస్థానంలో ఉన్న అమెరికా.. ఇప్పుడు ఎనిమిదో స్థానానికి పడిపోయింది.

లిథువేనియా దేశపు పాస్ పోర్ట్ కూడా 8వ ర్యాంకును పొందింది. ఈ రెండు దేశాల పాస్ పోర్ట్‌తో 184 గమ్యస్థానాలకు వీసా లేకుండా ట్రావెల్ చేయొచ్చు. నాలుగు ర్యాంకులో ఉన్న యునైటెడ్ కింగ్‌డమ్ పాస్ పోర్ట్‌తో వీసా లేకుండా 188 దేశాలను యాక్సెస్ చేయొచ్చు. ఈ ర్యాంకింగ్ జాబితాలో ప్రపంచంలోని అత్యంత బలహీన పాస్ పోర్టుల లిస్టులో ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, సిరియా ఉన్నాయి. ఆఫ్ఘనిస్తాన్ పాస్‌పోర్ట్ హోల్డర్‌లు 27 గమ్యస్థానాలకు మాత్రమే వీసా లేకుండా జర్నీ చేయగలరు.

Advertisement

Next Story

Most Viewed