- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Canada: కెనడాలో హిందువుల భద్రతపై ఆందోళన వ్యక్తం చేసిన ఇండియన్ మిషన్
దిశ, నేషనల్ బ్యూరో: కెనడా(Canada) బ్రాంప్టన్‌లోని(Brampton) ఆలయంలో వెలుపల ఖలిస్థానీ మద్దతుదారులు(pro-Khalistan supporters) విధ్వంసం సృష్టించారు. హిందూ భక్తులపై జరిగిన దాడి కలకలం రేపింది. ఖలిస్థానీ మద్దతుదారుల తీరుపై ఒట్టావాలోని ఇండియన్ మిషన్ (Indian Mission) మండిపడింది. హిందువులరి భద్రతపై ఆందోళన వ్యక్తం చేసింది. విదేశాల్లో ఉన్న భారతీయ పౌరులకు అత్యవసర సేవలు అందకుండా ఇలాంటి చర్యలతో అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యింది. కాగా, కెనడాలోని ఖలిస్థానీ తీవ్రవాదులు పరిధులు దాటిపోయారని కెనడా పార్లమెంటులో భారత సంతతికి చెందిన ఎంపీ చంద్ర ఆచార్య అన్నారు. హిందూ దేవాలయంపై జరిగిన దాడి.. కెనడాలో ఖలిస్థానీ హింసాత్మక తీవ్రవాదం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుందని, భావ ప్రకటనా స్వేచ్ఛ పేరుతో కెనడాలో ఖలిస్థానీ వేర్పాటువాదులు దుశ్చర్యలకు పాల్పడుతున్నారని చంద్ర ఆరోపించారు. మరోవైపు, దాడి జరిగినప్పుడు 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖలిస్థానీ మద్దతుదారుల బృందం ఒక ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు నివేదికలు సూచించాయి.
కెనడా ప్రధాని స్పందన
బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన దాడిపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పందించారు. “బ్రాంప్టన్‌లోని హిందూ దేవాలయంపై జరిగిన హింసాత్మక ఘటన ఆమోదయోగ్యం కాదు. ప్రతి కెనడియన్‌కు తమకు నచ్చిన మతాన్ని కొనసాగించే హక్కు ఉంది. ఈ ఘటనపై దర్యాప్తు చేయాలని ప్రాంతీయ పోలీసులను ఆదేశించా.” అని వెల్లడించారు. బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ఈ ఘటనపై ఆందోళన వ్యక్తం చేశారు. “కెనడాలో మత స్వేచ్ఛ అనేది ఒక ప్రాథమిక హక్కు. ప్రతి వ్యక్తి తమ ప్రార్థనా స్థలంలో సురక్షితంగా ఉండాలి. ప్రార్థనా స్థలం వెలుపల జరిగిన హింసాత్మక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. శాంతిభద్రతల పరిరక్షణకు, హింసాత్మక చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు చేపడతాం. దోషులుగా తేలిన వారిని చట్టం ప్రకారం శిక్షిస్తాం” అని పేర్కొన్నారు.