'UPI వాడితే స‌ర్వీస్ చార్జీలు'.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ‌

by Sumithra |   ( Updated:2022-08-29 15:33:20.0  )
UPI వాడితే స‌ర్వీస్ చార్జీలు.. క్లారిటీ ఇచ్చిన ఆర్థిక శాఖ‌
X

దిశ‌, వెబ్‌డెస్క్ః దేశంలో డిజిటల్ చెల్లింపుల‌కు కూడా స‌ర్వీస్ చార్జీలు వ‌సూలు చేయొచ్చంటూ ఇటీవ‌ల వ‌చ్చిన వార్త‌ల‌పై భారత ఆర్ధిక మంత్రిత్వ శాఖ స్ప‌ష్ట‌త ఇచ్చింది. యునైటెడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) చెల్లింపుల్లో ఎటువంటి రుసుము ఉండ‌ద‌ని, ఉచితమ‌ని పేర్కొంది. కాస్ట్ రికవరీకి సంబంధించి UPI సర్వీస్ ప్రొవైడర్ల ఆందోళనలను పరిష్కరించడానికి ఇతర పద్ధతులను ఉపయోగించాల్సి ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్ల‌డించింది. సాధారణ ప్రజలకు సౌకర్యాన్ని అందించే, ఆర్థిక ఉత్పాదకతను పెంచే డిజిటల్ 'పబ్లిక్ గుడ్‌'గా UPIని పేర్కొంది.

"UPI అనేది ప్రజలకు అపారమైన సౌలభ్యం & ఆర్థిక వ్యవస్థకు ఉత్పాదకత లాభాలతో కూడిన 'డిజిటల్ పబ్లిక్ గూడ్'. UPI సేవలకు ఎటువంటి ఛార్జీలు విధించడానికి ప్రభుత్వం ఎటువంటి పరిశీలన చేయ‌ట్లేదు. కాస్ట్ రికవరీ కోసం సర్వీస్ ప్రొవైడర్ల స‌మ‌స్య‌ల‌ను ఇతర మార్గాల ద్వారా తీర్చాలి. ప్రభుత్వం గత సంవత్సరం #DigitalPayment పర్యావరణ వ్యవస్థకు ఆర్థిక సహాయాన్ని అందించింది. #DigitalPayments, ఇత‌ర చెల్లింపు ప్లాట్‌ఫారమ్‌ల ప్రమోషన్‌ను మరింత ప్రోత్సహించడానికి ఈ సంవత్సరం కూడా య‌ధావిధిగా కొన‌సాగిస్తుంది," అని మంత్రిత్వ శాఖ ట్వీట్ట‌ర్‌లో పేర్కొంది.

ఇవి కూడా చదవండి : Google మీ డేటా సేకరిస్తే.. బీప్ సౌండ్‌తో అలర్ట్ చేసే యాప్

Advertisement

Next Story