'ఆ ఉగ్రమూకలకు చోటు ఇవ్వొద్దు' కెనడాకు భారత విదేశాంగ మంత్రి వార్నింగ్

by Vinod kumar |
ఆ ఉగ్రమూకలకు చోటు ఇవ్వొద్దు కెనడాకు భారత విదేశాంగ మంత్రి వార్నింగ్
X

న్యూఢిల్లీ : భారత విదేశాంగ మంత్రి జైశంకర్ కెనడాకు వార్నింగ్ ఇచ్చారు. భారత్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఖలిస్తానీ ఉగ్ర మూకలకు చోటు ఇవ్వొద్దని ఆ దేశాన్ని హెచ్చరించారు. బీజేపీ ఔట్ రీచ్ ప్రచారం సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. జూలై 8న మధ్యాహ్నం 12.30 గంటలకు టొరంటోలోని గ్రేట్ పంజాబ్ బిజినెస్ సెంటర్ నుంచి ఇండియన్ ఎంబసీ వరకు జరగనున్న ఖలిస్తాన్ ఫ్రీడమ్ ర్యాలీపై జైశంకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆ ర్యాలీకి సంబంధించిన పోస్టర్లపై కెనడాలోని భారతీయ హైకమిషనర్, టొరంటోలోని కాన్సులేట్ జనరల్‌‌లను ఫోటోలను ముద్రించడాన్ని.. వారిద్దరిని ఖలిస్తానీ హర్దీప్ నిజ్జార్ హంతకులుగా పేర్కొనడాన్ని ఆయన ఖండించారు. అలాంటి ర్యాలీలు జరగకుండా చూడాల్సిన బాధ్యత కెనడాపై ఉందన్నారు. "కెనడా, అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ఖలిస్తానీ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ఉగ్రవాద భావజాలం కలిగిన ఖలిస్తానీలకు చోటు ఇవ్వొద్దని ఆ దేశాలకు చాలాసార్లు చెప్పాం. మా మాటను వినిపించుకోకపోతే ఆ దేశాలతో భారత్ సంబంధాలు దెబ్బతింటాయి" అని జైశంకర్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed