- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Israel: భవన నిర్మాణ కార్మికులకు ఇజ్రాయెల్ లో పుష్కలంగా ఉపాధి అవకాశాలు
దిశ, నేషనల్ బ్యూరో: ఇజ్రాయెల్(Israel) లో భారత్ కు చెందిన భవన నిర్మాణ కార్మికులకు పుష్కలంగా ఉపాధి అవకాశాలు పెరిగిపోయాయి. అక్టోబర్ 7, 2023 దాడుల తర్వాత పాలస్తీనా కార్మికుల(Palestinians) రాకపై ఇజ్రాయెల్ నిషేధం విధించింది. దీంతో, ఇజ్రాయెల్ కు భారత కార్మికులు(Indians) పోటెత్తుతున్నారు. గతేడాది నుంచి దాదాపు 16 వేల మంది భారత్ కు చెందిన కార్మికులు ఇజ్రాయెల్ లో పలు నిర్మాణాల్లో పనిచేస్తున్నారు. ఢిల్లీకి చెందిన డైనమిక్ స్టాఫింగ్ సర్వీసెస్ ఛైర్మన్ దాదాపు 5 లక్షల మంది భారతీయులను 30కి పైగా దేశాల్లో పని చేయడానికి పంపారు. అయితే, ఇప్పటివరకు 3,500 మందికి పైగా కార్మికులను ఇజ్రాయెల్‌కు పంపినట్లు తెలిపారు. ఇజ్రాయెల్ లో ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. ఇజ్రాయెల్‌లో "తక్కువ సమయంలో, ఎక్కువ డబ్బు సంపాదించవచ్చు" అని యూపీకి చెందిన కార్మికుడు సురేశ్ కుమార్ వర్మ తెలిపాడు. ఏదైనా ప్రమాదం పొంచి ఉందని సైరన్లు మోగితే సురక్షిత ప్రదేశాల్లో తలదాచుకుని ఆ తర్వాత పనిలోకి వెళ్తున్నామని కార్మికుడు తెలిపాడు.
దశాబ్దాలుగా ఉపాధి
ఇకపోతే, దశాబ్దాలుగా భారతీయులు ఇజ్రాయెల్‌లో ఉపాధి పొందుతున్నారు. కేర్ టేకర్లుగా, వజ్రాల వ్యాపారులుగా,ఐటీ నిపుణులుగా పనిచేస్తున్నారు. కాగా.. గాజాలో యుద్ధం తీవ్రతరం కావడంతో, రిక్రూటర్లు ఇజ్రాయెల్ నిర్మాణ రంగంలోకి భారతీయులను తీసుకురావడానికి డ్రైవ్‌ను ప్రారంభించారు. నిర్మాణరంగానికి ముందు అక్కడ భారీ సంఖ్యలో పాలిస్తీనియన్లు పనిచేసినట్లు ఇజ్రాయెల్ అధికారులు చెబుతున్నారు. హమాస్ దాడికి ముందు, దాదాపు 80 వేలమంది పాలస్తీనియన్లు నిర్మాణంలో పనిచేస్తున్నారని.. వీరితో పాటు 26,000 మంది విదేశీయులు ఉన్నారని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇజ్రాయెల్‌కు చెందిన ఇయల్ అర్గోవ్ చెప్పారు. ప్రస్తుతం, అక్కడ దాదాపు 30,000 మంది విదేశీయులు ఉపాధి పొందుతున్నట్లు పేర్కొన్నారు. మునుపటి శ్రామిక శక్తి గణాంకాల కంటే చాలా తక్కువని చెప్పారు.