J&K: దాడుల నుంచి రక్షించుకోడానికి ప్రజలకు భారత సైన్యం శిక్షణ

by Harish |   ( Updated:2024-09-07 05:17:14.0  )
J&K: దాడుల నుంచి రక్షించుకోడానికి ప్రజలకు భారత సైన్యం శిక్షణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇటీవల కాలంలో వరుసగా జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో భారత సైన్యం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఉగ్రవాద బెదిరింపులకు వ్యతిరేకంగా స్థానిక భద్రతను పెంపొందించడానికి విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ (VDGs)కి శిక్షణ ఇవ్వడం మొదలుపెట్టింది. స్థానిక పోలీసుల సహకారంతో, ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దాదాపు 600 మంది ఆటోమేటిక్ రైఫిల్స్, స్క్వాడ్ పోస్ట్ డ్రిల్స్, చిన్న వ్యూహాలను నిర్వహించడంలో ఇంటెన్సివ్ శిక్షణ పొందుతున్నారు. శిక్షణను కూడా గ్రామాలకు దగ్గరగా, ప్రజలకు అందుబాటు దూరంలోనే నిర్వహిస్తున్నారు. అందరిని కూడా యూనిట్‌ల వారీగా విభజించి శిక్షణ అందిస్తున్నారు. ఒక్కో యూనిట్ కనీసం మూడు రోజుల శిక్షణ పొందుతోంది.

ఈ కార్యాక్రమం, పౌరులను వారి గ్రామాలను రక్షించడానికి నైపుణ్యాలతో సన్నద్ధం చేయడానికి, ప్రాంతం మొత్తం భద్రతను బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. జమ్మూకశ్మీర్ పోలీసుల అభ్యర్థన మేరకు ఈ కార్యక్రమం ప్రారంభించారు. ఇప్పటికే రాజౌరిలో 500 మంది వ్యక్తులకు, దోడా, కిష్త్వార్‌లో 85–90 మందికి శిక్షణ ఇచ్చారు. ఆర్మీ ఆర్డినెన్స్ డిపోలు, జమ్మూకశ్మీర్ పోలీసుల సంయుక్త ప్రయత్నం ద్వారా అందించిన సెల్ఫ్-లోడింగ్ రైఫిల్స్ (SLRలు)తో విలేజ్ డిఫెన్స్ గార్డ్స్ పనిచేస్తారు. దీని వలన వారి కమ్యూనిటీలను రక్షించుకోవడానికి వారికి మరింత వీలవుతుంది.

Advertisement

Next Story

Most Viewed