పాక్ డ్రోన్‌పై భారత్ సైన్యం కాల్పులు: ఎల్ఓసీ సమీపంలో ఘటన

by samatah |
పాక్ డ్రోన్‌పై భారత్ సైన్యం కాల్పులు: ఎల్ఓసీ సమీపంలో ఘటన
X

దిశ, నేషనల్ బ్యూరో: జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో నియంత్రణ రేఖ(ఎల్ఓసీ) సమీపంలో పాక్ డ్రోన్‌పై భారత సైన్యం కాల్పులు జరిపినట్టు అధికారులు వెల్లడించారు. ఆదివారం అర్ధరాత్రి భారత భూభాగంలోకి వచ్చిన డ్రోన్ కొద్ది సేపు సంచరించి తిరిగి పాక్ వైపు తిరిగి వెళ్లినట్టు తెలిపారు. మెంధార్‌లోని నార్ మాన్‌కోట్ ప్రాంతంలో పాక్ డ్రోన్‌ను గుర్తించగా..ఎల్ఓసీ వద్ద ఉన్న సైనికులు డ్రోన్ పైకి మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు పేర్కొన్నారు. భారత సైన్యం అటాక్ నేపథ్యంలో డ్రోన్ పాకిస్తాన్ వైపు వెళ్లిందని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నట్టు తెలిపారు. ఈ డ్రోన్‌లను ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతుగా భారత భూభాగంలో డ్రగ్స్, ఆయుధాలను అందజేయడానికి ఉపయోగిస్తుండటం ఆందోళన కలిగిస్తుంది.

కశ్మీర్‌లో పెరిగిన ఘటనలు

గత కొన్నేళ్లుగా, జమ్మూ కశ్మీర్ సరిహద్దు సమీపంలో మోహరిస్తున్న డ్రోన్‌ల సంఖ్య భారీగా పెరిగింది. ఈ డ్రోన్‌ల ద్వారా భారీగా మాదక ద్రవ్యాలను భారత్‌లోకి తరలిస్తున్నట్టు సైన్యం గుర్తించింది. అంతేగాక అనేక డ్రోన్లను స్వాధీనం చేసుకోగా అందులో డగ్స్ పట్టుబడ్డ ఘటనలూ అనేకం ఉన్నాయి. ఈ నేపథ్యంలో సరిహద్దుల నుంచి ఇలాంటి ప్రయత్నాలన్నింటినీ భగ్నం చేసేందుకు భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయని ఆర్మీ వర్గాలు తెలిపాయి. కాగా, మత్తుపదార్థాలు, ఆయుధాలు సరఫరా, సరిహద్దు అవతల నుంచి డ్రోన్‌లను ఎగురవేసిన వారి సమాచారం ఇస్తే రూ. 3 లక్షల నగదు బహుమతి అందజేస్తామని కశ్మీర్ పోలీసులు ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే.

Advertisement

Next Story

Most Viewed