- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భారత్ ఏ సమస్యనైనా పరిష్కరిస్తుంది: యూపీ పర్యటనలో ప్రధాని మోడీ
దిశ, నేషనల్ బ్యూరో: భారత్‌పై ప్రధాని మోడీ మరోసారి ప్రశంసలు కురిపించారు. భారత్ తలుచుకుంటే పరిష్కారం కాని సమస్య ఏదీ లేదని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించే సత్తా భారత్‌కు ఉందని ఇది మొత్తం ప్రపంచానికే నిరూపించిందని కొనియాడారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిలిబిత్‌లో మంగళవారం జరిగిన ఎన్నికల ర్యాలీలో మోడీ ప్రసంగించారు. ‘లక్ష్యాన్ని ఎంత కష్టమైనా సాధించాలనే పట్టుదలతో భారత్ ఉంటే అది కచ్చితంగా సాధిస్తుంది. ఈ స్ఫూర్తి, శక్తితోనే అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించేందుకు కృషి చేస్తున్నాం’ అని వెల్లడించారు. ఒకప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రపంచం నుంచి సహాయం కోరేదని, కానీ కొవిడ్ మహమ్మారి సమయంలో భారత్ అనేక దేశాలకు మందులు అందించిందని గుర్తు చేశారు.
‘ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా భారత్ అవతరించినప్పుడు, చంద్రయాన్ ప్రయోగం విజయవంతం అయినప్పుడు, భారతదేశంలో జీ 20 శిఖరాగ్ర సమావేశం జరిగినప్పుడు ఎంతో మంది ప్రశంసించారు’ అని వ్యాఖ్యానించారు. ఏదైనా దేశం బలపడితే దాని మాట ప్రపంచం మొత్తం వింటుందని నొక్కి చెప్పారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణాన్ని అడ్డుకునేందుకు కాంగ్రెస్ తన శాయశక్తులా ప్రయత్నించిందని, అయితే దేశంలోని ప్రజలు ప్రతి పైసా విరాళంగా ఇచ్చి ఆలయ నిర్మాణంలో భాగస్వాములయ్యారని తెలిపారు.