ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్‌లో స్వాతంత్య్ర దిన వేడుకలు

by Hajipasha |   ( Updated:2022-08-15 17:17:16.0  )
ఆరెస్సెస్ హెడ్ క్వార్టర్స్‌లో స్వాతంత్య్ర దిన వేడుకలు
X

న్యూఢిల్లీ: ఎన్నో పోరాటాల తర్వాత భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చిందని, దేశానికి స్వావలంబన కావాలని ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. సోమవారం స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో నాగ్‌పూర్‌లోని ఆరెస్సెస్ ప్రధానకార్యాలయంలో పతాకావిష్కరణ చేశారు. భారత్ ప్రపంచానికి శాంతి సందేశం అందించాలని అన్నారు. దేశం, సమాజం ఏం ఇస్తారని అడగకూడదని, దేశాభివృద్ధికి ఏం ఇస్తున్నారో ఆలోచించాలని అన్నారు. త్రివర్ణపతాకం త్యాగానికి ప్రతీక అని చెప్పారు. ప్రజలు సమాజం కోసం పనిచేస్తూ, ప్రపంచ దేశాలకు ఉదాహరణగా నిలవాలని అన్నారు. స్వాతంత్ర్యం ఎవరి క్షమాభిక్ష కాదని, దేశానికి స్వావలంబన అవసరమని అన్నారు.

స్వతంత్రంగా ఉండాలనుకునే వారు ప్రతి విషయంలో స్వావలంబన కలిగి ఉండాలని చెప్పారు. కాగా ముందు నుంచి ఆరెస్సెస్ స్వాతంత్ర్యదినోత్సవం, రిపబ్లిక్ డే రోజున జాతీయ పతాకాన్ని అవిష్కరించడం పట్ల నమ్మకాన్ని కలిగి లేదు. గతంలో 1947 ఆగస్టు 15, 1950 జనవరి 20న త్రివర్ణపతాకాన్ని ఎగరవేసింది. ఆ తర్వాత 2002లో అటల్ బిహారీ వాజ్‌పేయ్ ఈ సంప్రదాయాన్ని మార్చారు. అప్పటినుంచి ఏటా ఆగస్టు 15, జనవరి 26 జాతీయ ప్రధాన కార్యాలయంలో జెండా ఎగరవేస్తూ వస్తున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో క్రీడాకారులు

Advertisement

Next Story

Most Viewed