- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆ విషయంలో ఇండియాను మించిన బంగ్లాదేశ్, భూటాన్
దిశ, నేషనల్ బ్యూరో : 2022 సంవత్సరానికి సంబంధించిన మానవాభివృద్ధి సూచిక (హెచ్‌డీఐ)ను ఐక్యరాజ్యసమితి అభివృద్ధి కార్యక్రమం(యూఎన్డీపీ) తాజాగా విడుదల చేసింది. దీని ప్రకారం భారతదేశపు హెచ్‌డీఐ విలువ 0.633 నుంచి 0.644కు పెరిగింది. ‘‘బ్రేకింగ్ ది గ్రిడ్‌లాక్ : రీఇమేజినింగ్ కోఆపరేషన్ ఇన్ ఎ పోలరైజ్డ్ వరల్డ్’’ పేరుతో ఈనివేదికను ఐరాస రిలీజ్ చేసింది. గత కొన్ని సంవత్సరాల మాదిరిగానే ఈసారి కూడా భారత్ ఈ సూచికలో మధ్యస్థమైన రేంజ్‌లో నిలిచింది. ప్రపంచంలోని ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్.. 193 దేశాలతో రూపొందించిన ఈ లిస్టులో 134వ స్థానంలో నిలవడం గమనార్హం. దేశ పౌరుల సగటు ఆయుర్దాయం, సగటు విద్యాసంవత్సరాలు, సగటు ఆదాయాలు అనే మూడు ప్రమాణాల ఆధారంగా ఈ సూచికను రూపొందించారు. 2022లో మన దేశంలో పౌరుల సగటు ఆయుర్దాయం 67.2 నుంచి 67.7 సంవత్సరాలకు పెరిగింది. విద్యార్థులు సగటున 12.6 సంవత్సరాలు చదువుకుంటున్నారని.. 25 ఏళ్లకుపైబడిన దేశ పౌరులు సగటున 6.57 సంవత్సరాల పాటు విద్యను అభ్యసించారని హెచ్‌డీఐ సూచికలో ప్రస్తావించారు. దేశ ప్రజల వార్షిక తలసరి ఆదాయం రూ.5.42 లక్షల నుంచి రూ.5.75 లక్షలకు పెరిగిందని వెల్లడించారు. మానవాభివృద్ధి సూచికలో మనదేశం కంటే బంగ్లాదేశ్ (129వ స్థానం), భూటాన్ (125వ స్థానం), శ్రీలంక (78వ స్థానం), చైనా (75వ స్థానం) మెరుగైన ర్యాంకింగ్ సాధించడం గమనార్హం.