- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
India, France: హై టెక్నాలజీలో భాగస్వామ్యం పెంపు.. ఇండియా ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందం

దిశ, నేషనల్ బ్యూరో: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్ర మోడీ (Narendra modi) వచ్చే నెలలో ప్యారిస్‌లో పర్యటించనున్న నేపథ్యంలో ఇండియా, ఫ్రాన్స్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. అత్యాధునిక టెక్నాలజీలో తమ భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించాయి. ప్యారిస్‌లో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ (Vikram misry), ఫ్రెంచ్ విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ జనరల్ అన్నే-మేరీ డెస్కోట్స్‌ల మధ్య జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. రక్షణ, పౌర అణుశక్తి, అంతరిక్షం, సైబర్ డిజిటల్, ఏఐపై పరస్పర మార్పిడిని ప్రోత్సహించే కార్యక్రమాలతో సహా ద్వైపాక్షిక సహకారానికి సంబంధించిన కీలక రంగాలపై చర్చలు జరిగినట్టు పేర్కొంది. అత్యున్నత సాంకేతిక రంగాలలో ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని విస్తరించేందుకు ఇరుపక్షాలు అంగీకరించినట్టు వెల్లడించింది. కాగా, ఫ్రాన్స్ భారతదేశానికి అత్యంత సన్నిహిత వ్యూహాత్మక భాగస్వామి. రాఫెల్ యుద్ధ విమానాల నుంచి అధునాతన జలాంతర్గాముల వరకు రక్షణ హార్డ్‌వేర్‌ల సరఫరాదారుగా ఉంది. రెండు దేశాలు రక్షణ, భద్రతా సమస్యలు, ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలోనూ పరస్పరం సహకరించుకుంటాయి.