Lakshadweep : మాల్దీవ్స్‌ ఇష్యూ: ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు..!

by Mahesh |   ( Updated:2024-01-07 13:52:02.0  )
Lakshadweep : మాల్దీవ్స్‌ ఇష్యూ: ముగ్గురు మంత్రులపై సస్పెన్షన్ వేటు..!
X

దిశ, వెబ్‌డెస్క్: భారత్‌లో బాయ్‌కాట్ మాల్దీవ్స్ ట్రెండింగ్‌లోకి రావడంతో మాల్దీవుల ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీతో పాటుగా భారతీయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురు మంత్రులను సస్పెండ్ చేసినట్లు మాల్దీవుల అధికార ప్రతినిధి ఇబ్రహీం ఖలీల్ చెప్పుకొచ్చాడు. కాగా షియూనా, మాల్షా, హసన్ జిహాన్ అనే ముగ్గురు మంత్రులు తమ సోషల్ మీడియలో భారత దేశాన్ని, ప్రధాని మోడీని టార్గెట్ చేసుకుని ఇష్టారీతిన వ్యాఖ్యలు చేశారు.

భారత్ మాల్దీవులకు పోటీగా లక్ష్యదీప్‌లను మార్చే ప్రయత్నం చేస్తుందని అది ఎప్పటికీ చేయలేరని ఒకరు అనగా మరోకరు భారతీయులు అపరిశుభ్రంగా ఉంటారని సోషల్ మీడియాలో రాసుకొచ్చారు. దీంతో యావత్ భారత్ వారికి కౌంటర్ ఇచ్చింది. దీనికి కొంతమంది భారత ప్రముఖులు మద్దతు తెలిపారు. దీంతో మాల్దీవ్స్ టూరిజం ఒక్కరోజు ఘోరంగా దెబ్బతింది. ఇదిగమణించిన అక్కడి ప్రభుత్వం వెంటనే దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే భారత్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ముగ్గురిపై సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది.

Advertisement

Next Story