రేపు ‘ఇండియా’ కో-ఆర్డినేషన్ కమిటీ మీటింగ్.. ఎన్నికల క్యాంపెయిన్‌పై చర్చ

by Vinod kumar |
రేపు ‘ఇండియా’ కో-ఆర్డినేషన్ కమిటీ మీటింగ్.. ఎన్నికల క్యాంపెయిన్‌పై చర్చ
X

న్యూఢిల్లీ: ప్రతిపక్షాల ‘ఇండియా’ కూటమికి సంబంధించి కో ఆర్డినేషన్ కమిటీ బుధవారం మొదటిసారిగా సమావేశం కానుంది. ఉమ్మడి ఎన్నికల ప్రచారాలు, ర్యాలీలు, వివాదాస్పద సీట్ల షేరింగ్ ప్రక్రియపై ఈ సందర్భంగా చర్చించనున్నారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ నివాసంలో సాయంత్రం 4 గంటలకు జరగనున్న ఈ సమావేశంలో కేసీ వేణుగోపాల్, టీఆర్ బాలు, హేమంత్ సోరెన్, సంజయ్ రౌత్, తేజస్వీ యాదవ్, రాఘవ్ చద్దా, జావేద్ అలీఖాన్, రాజీవ్ రంజన్ లాలన్ తదితరులు పాల్గొంటారు.

ఈ మేరకు సీట్ల పంపకంతో పాటు ప్రచార సమయంలో ఎలాంటి కార్యక్రమాలు ఎక్కడ నిర్వహించాలనే అంశంపై చర్చిస్తామని భారత రాష్ట్రీయ జనతాదళ్ (ఆర్‌జేడీ) ఎంపీ మనోజ్ ఝా తెలిపారు. ఇప్పటికే సోషల్ మీడియా కమిటీ, ప్రచార కమిటీ, పరిశోధనా కమిటీ సమావేశాలు జరిగాయన్న మనోజ్.. ఆయా కమిటీల చర్చలన్నింటికీ ఈ సమావేశంలో ఆమోద ముద్ర వేయబడుతుందని అన్నారు. ఎజెండాకు తుది రూపం ఇవ్వబడుతుందని పేర్కొన్నారు. అక్టోబర్ 2న విడుదలయ్యే విజన్ డాక్యుమెంట్ కంటెంట్‌ను కూడా ప్యానెల్ చర్చించనుందని తెలుస్తోంది.

Advertisement

Next Story

Most Viewed