INDIA bloc : నేడు పార్లమెంటులో ‘ఇండియా’ ఎంపీల నిరసన

by Hajipasha |
INDIA bloc : నేడు పార్లమెంటులో ‘ఇండియా’ ఎంపీల నిరసన
X

దిశ, నేషనల్ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌కు వ్యతిరేకంగా విపక్ష ‘ఇండియా’ కూటమి ఎంపీలు బుధవారం ఉదయం పార్లమెంటులో నిరసన తెలపనున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు పాలిస్తున్న రాష్ట్రాలను పూర్తిగా విస్మరించి కేంద్ర బడ్జెట్‌ను ఏకపక్షంగా రూపొందించారని విపక్ష నేతలు మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో ఇండియా కూటమి నేతల సమావేశం జరిగింది.

ఈసందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌తో దేశ బడ్జెట్‌ అనే కాన్సెప్ట్‌ ధ్వంసమైందన్నారు. చాలా రాష్ట్రాల పట్ల ఎన్డీయే సర్కారు వివక్షాపూరితంగా వ్యవహరించిందని మండిపడ్డారు.దీనిపై చర్చించేందుకే తామంతా ఖర్గే నివాసంలో సమావేశమైనట్లు చెప్పారు. సమావేశం అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ ప్రమోద్‌ తివారీ మాట్లాడుతూ.. ‘‘ఇది దేశ బడ్జెట్ కాదు.. బీజేపీ బడ్జెట్’’ అని వ్యాఖ్యానించారు. కేంద్ర ప్రభుత్వం ‘బీజేపీ బడ్జెట్‌’ను ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ తాము బుధవారం రోజు పార్లమెంటులో నిరసన తెలుపుతామని ఆయన ప్రకటించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ అగ్రనేత, విపక్ష నేత రాహుల్‌ గాంధీ, ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, సంజయ్‌ రౌత్‌ తదితరులు పాల్గొన్నారు.



Next Story