‘మహా’ ఎన్డీయే మీటింగ్.. లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చ

by Vinod kumar |
‘మహా’ ఎన్డీయే మీటింగ్.. లోక్‌సభ ఎన్నికల వ్యూహంపై చర్చ
X

ముంబై : ఓ వైపు ముంబై వేదికగా ఇండియా కూటమి భేటీ అవుతుంటే.. మరోవైపు మహారాష్ట్రలోని ఎన్డీయే కూటమి కూడా గురు, శుక్రవారాల్లో పోటీగా సమావేశం కానుంది. సీఎం ఏక్ నాథ్ షిండే సారథ్యంలో జరగనున్న ఈ రెండు రోజుల సమావేశాల్లో తన బలాన్ని ప్రదర్శించాలని ఎన్డీయే అనుకుంటోంది. ఈ మీటింగ్ వేదికగా ఎన్డీయేలోకి అజిత్ పవార్ ఎన్సీపీ చీలిక వర్గాన్ని ఆహ్వానించాలని బీజేపీ యోచిస్తోంది. దీంతోపాటు రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు సంబంధించి సమీక్షా సమావేశాలను నిర్వహించేందుకు షిండే సర్కారు రెడీ అయింది.

ఆగస్టు 31న సీఎం అధికారిక నివాసంలో ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, డిప్యూటీ సీఎంలు దేవేంద్ర ఫడణవీస్‌, అజిత్‌ పవార్‌ సారథ్యంలో ఆయా పార్టీల ముఖ్య నేతలతో కీలక భేటీ జరగనుంది. సెప్టెంబర్‌ 1న రాష్ట్రంలోని కీలక లోక్ సభ స్థానాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్య నేతలతో వీరు చర్చించనున్నారు.

Advertisement

Next Story

Most Viewed