ఇండియా కూటమి మరో కీలక నిర్ణయం.. మోడీ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్..!

by Satheesh |
ఇండియా కూటమి మరో కీలక నిర్ణయం.. మోడీ సర్కార్‌ను ఇరుకున పెట్టేలా భారీ స్కెచ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో పొలిటికల్ వెదర్ హాట్ హాట్‌గా సాగుతోంది. ఓ వైపు పార్లమెంట్ స్పెషల్ సెషన్‌‌తో రాజధానిలో కోలాహాలం నెలకొనగా.. మరోవైపు ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు భేటీ అయ్యారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో గురువారం ఇండియా కూటమి నేతలు సమావేశమయ్యారు. ఈ భేటీకి కాంగ్రెస్ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, శరత్ పవార్, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియన్, శివసేన యూబీటీ నేత సంజయ్ రౌత్, ఎన్సీపీ ఎంపీ సుప్రియ సూలే సహా ఇండియా కూటమిలోని ముఖ్య ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఇప్పటి వరకు జరిగిన పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ఈ భేటీలో చర్చించారు.

ఇకపై ఇండియా కూటమి పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహం, లేవనెత్తాల్సిన అంశాలపై డిస్కస్ చేశారు. స్పీకర్ ఎన్నిక, రాష్ట్రపతి ప్రసంగంపై చర్చలు జరిపిన నేతలు.. రానున్న రోజుల్లో నీట్, అగ్ని వీర్, నిరుద్యోగం వంటి అంశాలను పార్లమెంట్‌లో లేవనెత్తి మోడీ సర్కార్‌ను ఇరుకున పెట్టాలని ఇండియా కూటమి నేతలు డిసైడ్ అయ్యారు. కాగా, నీట్ పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కుల కేటాయింపు వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే నీట్ వివాదంతో పాటు నిరుద్యోగ సమస్య, అగ్ని వీర్ స్కీమ్‌ను అవకాశంగా మల్చుకుని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎటాక్ చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది.

Advertisement

Next Story

Most Viewed