లైంగిక దాడులు, విడాకుల ఫిర్యాదులు పెరిగాయి: కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ

by Harish |
లైంగిక దాడులు, విడాకుల ఫిర్యాదులు పెరిగాయి: కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ
X

న్యూఢిల్లీ: దేశంలో గత మూడేళ్లలో విడాకులు, లైంగిక దాడులకు సంబంధించిన ఫిర్యాదు స్వీకరణలు పెరిగాయని కేంద్ర స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ తెలిపింది. తాజాగా లోక్‌సభలో ఓ ప్రశ్నకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ బదులిచ్చారు. 2020లో 330, 2021లో 341, 2022లో 357 విడాకులకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయని ఆమె తెలిపారు. అంతేకాకుండా లైంగిక దాడులకు సంబంధించి 2022లో 1,710, 2021లో 1,681, 2020లో 1,236 ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. దేశంలో 28 రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లో 764 ఫాస్టాక్ స్పెషల్ కోర్టులు, 411 ఎక్స్క్లూజివ్ పోక్సో కోర్టులు కార్యనిర్వహణలో ఉన్నాయని తెలిపారు. ఇప్పటివరకు 1,44,000 కేసులకు పైగా పరిష్కారం కాగా, 1,98,000 కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నాయని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed