- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
అట్టడుగు వర్గాల ప్రజలను మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది: రాహుల్ గాంధీ
దిశ, నేషనల్ బ్యూరో: దేశంలోని అట్టడుగు వర్గాలకు చెందిన 73 శాతం జనాభాను కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. ఆదివారం ఆర్జేడీ పాట్నాలో నిర్వహించిన 'జన్ విశ్వాస్ ర్యాలీ'లో పాల్గొన్న రాహుల్ గాంధీ, బీజేపీని ఉద్దేశించి, 'ఒక పార్టీ ప్రజల మధ్య విధ్వేషాన్ని సృష్టించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే, తాము నఫ్రత్ కె బజార్ మే మొహబ్బత్ (ద్వేషం అంగట్లో ప్రేమ) అందిస్తున్నామని ' అన్నారు. దేశంలో రైతులు, యువత, అణగారిన వర్గాలకు అన్యాయం జరుగుతోందని రాహుల్ గాంధీ ఆరోపణలు చేశారు. ముఖ్యంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు చెందిన 73 శాతం జనాభాను కేంద్రం నిర్లక్ష్యం చేస్తోంది. అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్ స్కీమ్‌ను ప్రస్తావిస్తూ, బీహార్‌లో నిరసనలకు దారితీసిన ఈ పథకం దేశంలోని యువతకు వ్యతిరేకంగా ఉందన్నారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గె మాట్లాడుతూ, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంటుందని చెప్పారు. తమపై ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర సంస్థలతో భయపెట్టాలని చూడటం కుదరని పని అని పేర్కొన్నారు.