డీమార్ట్‌కు ఊహించని షాక్.. ఒక్క రోజులో వేల కోట్లు లాస్

by Mahesh |   ( Updated:2024-10-15 14:00:50.0  )
డీమార్ట్‌కు ఊహించని షాక్.. ఒక్క రోజులో వేల కోట్లు లాస్
X

దిశ, వెబ్ డెస్క్: వ్యాపార రంగంలో హంగులు ఆర్భాటాలు, పబ్లిసిటీ లేకుండా.. పేద, ధనిక ప్రజలకు చేరువైన సంస్థల్లో డీమార్ట్(D-Mart) ఒకటి. మావన జీవన మనుగడకు సంబంధించిన అన్ని వస్తువులు అందించే స్టోర్ గా పేరుగాంచిన డీమార్ట్.. స్టోర్ లేని నగరం ఉండనే ఉండదు. అంతటి పేరు రావడంతో దీనికి ఇటీవల కాలంలో స్టాక్ మార్కెట్లో కూడా భారీగా లాభాలు వచ్చాయి. దీంతో డీ మార్ట్ షేర్ల విలువ అమాంతం పెరిగిపోయాయి. ఈ క్రమంలో లక్షల మంది అందులో షేర్లు కొన్నారు. అయితే ఏమైందో ఏమో గాని ఒక్కసారిగా డీ మార్ట్ కు ఊహించని షాక్ తగిలింది. ఎవరూ ఊహించలేని విధంగా ఒక్కరోజులో డీ మార్ట్ 29 వేల కోట్ల సంపద ఆవిరైపోయింది. వివరాల్లోకి వెళితే.. జూలై, సెప్టెంబర్ కు సంబంధించి క్వార్టర్లీ రిజల్ట్స్ లో డీ మార్ట్ తన ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయింది. దీంతో D-Mart షేరు ధ 8 శాతం పతనమై.. రూ. 4186 వద్ద కొనసాగుతుంది. ఇదిలా ఉంటే గత ఫలితాల కంటే 5 శాతం అధిక లాభాలతో రూ. 659 కోట్ల నికర లాభాన్ని రాబట్టినప్పటికీ ఇన్వెస్టర్లను మాత్రం డీ మార్ట్ సంతృప్తి పరచ లేక పోయింది. దీని ఫలితంగా కంపెనీ మార్కెట్ విలువ ఒక్కరోజులో 27 వేల కోట్లు మేర కోల్పోయింది. అయితే ఇందులో బడా ఇన్వెస్టర్లు ఒక్కసారిగా పెద్ద మొత్తంలో అమ్మకాలు చేయడంతో.. డీ మార్ట్ షేర్లు పడిపోయాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

Next Story