- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కానిస్టేబుల్‌పై రెండేళ్లపాటు వేధింపులకు పాల్పడ్డ సబ్-ఇన్‌స్పెక్టర్
దిశ, నేషనల్ బ్యూరో: ఒక సబ్-ఇన్‌స్పెక్టర్ రెండేళ్లపాటు ఒ మహిళ కానిస్టేబుల్‌ను వేధింపులకు గురిచేసిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మహారాష్ట్రలోని నవీ ముంబై టౌన్‌షిప్‌లో వివాహం అయిన మహిళా కానిస్టేబుల్‌పై అత్యాచారం చేసి, ఆమెను వేధించినందుకు 32 ఏళ్ల పోలీసు సబ్-ఇన్‌స్పెక్టర్‌పై కేసు నమోదైందని అధికారులు ఆదివారం తెలిపారు. నిందితుడు మొదటగా 26 ఏళ్ల బాధిత మహిళా కానిస్టేబుల్‌తో స్నేహం చేసి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి సాన్‌పద ప్రాంతంలో ఒక ఫ్లాట్‌లో ఆమెపై అనేకసార్లు అత్యాచారం చేశాడు. అంతేకాకుండా అతను ఆమె వద్ద నుంచి ఏదో ఒక సాకుతో రూ.19 లక్షలు తీసుకోగా, వాటిలో కేవలం రూ. 14.61 లక్షలు మాత్రమే తిరిగి ఇచ్చాడు.
నిందితుడు మహిళను వెంబడించి తన భర్తను విడిచిపెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు మాట వినకుంటే చంపేస్తానని బెదిరించాడు. దాదాపు రెండేళ్ల పాటు 2020 నుంచి జులై 2022 మధ్య ఇదంతా జరిగింది. తాజాగా దీనిపై ముంబైలోని పంత్ నగర్ పోలీస్ స్టేషన్‌లో మొదట ఫిర్యాదు నమోదైంది. దాని ఆధారంగా నిందితునిపై భారతీయ శిక్షాస్మృతి సెక్షన్లు 376 (రేప్),354(ఎ) లైంగిక వేధింపులు,354(డి) వెంబడించడం, క్రిమినల్ బెదిరింపు, మోసం కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు స్టేషన్ అధికారి తెలిపారు. ఈ ఘటనపై ప్రస్తుతం అధికారులు విచారణ చేస్తున్నారు.