కర్ణాటక ఫలితాల్లో బ్రహ్మానందం ఫ్రెండ్ వెనుకంజ

by Nagaya |   ( Updated:2023-05-13 05:52:38.0  )
కర్ణాటక ఫలితాల్లో బ్రహ్మానందం ఫ్రెండ్ వెనుకంజ
X

దిశ, డైనమిక్ బ్యూరో: కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. తెలుగు ప్రజలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో భిన్నమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలుగు స్టార్ కమెడియన్ బ్రహ్మానందం ప్రచారం చేసిన చోట బీజేపీ అభ్యర్థి సుధాకర్ వెనుకంజలో ఉన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న సుధాకర్ బ్రహ్మానందం స్నేహితులు. దీంతో తన స్నేహితుడు సుధాకర్ తరపున బ్రహ్మానందం నాలుగు రోజుల పాటు చిక్ బల్లాపూర్ నియోజక వర్గంలో ప్రచారం నిర్వహించాడు. అయితే ఈ స్థానంలో ఉదయం 11 గంటల వరకు ఎన్నికల కమిషన్ లెక్కల ప్రకారం కాంగ్రెస్ అభ్యర్థి ప్రదీప్ ఈశ్వర్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ప్రదీప్‌కు మొత్తం 5583 ఓట్లు రాగ బ్రహ్మానందం స్నేహితుడైన బీజేపీ అభ్యర్థి డా.కె. సుధాకర్‌కు 3628 ఓట్లు వచ్చాయి. అన్ని రౌండ్ల ఫలితాలు వచ్చే సరికి ఆధిక్యతలో ఏదైనా మార్పులు ఉంటాయా లేక ఇదే ట్రెండ్ సాగుతుందా అనేది ఉత్కంఠగా మారింది.

Also Read...

కర్ణాటక రిజల్ట్స్ : కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద ‘జై బజ్‌రంగ్ బలి’ నినాదాలు

Advertisement

Next Story