- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కర్ణాటకలో భార్య తల నరికి, మృతదేహాన్ని ముక్కలుగా చేసిన వ్యక్తి
దిశ, నేషనల్ బ్యూరో: కర్ణాటకలో దారుణం జరిగింది. భర్త తన భార్యను హతమార్చడమే కాకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. మంగళవారం నాడు ఈ విషయం వెలుగులోకి రాగా నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు పేర్కొన్న వివరాల ప్రకారం, తుమకూరు జిల్లాలోని హోస్పేట్ గ్రామంలో నిందితుడైన శివరామ్ తన భార్య 32 ఏళ్ల పుష్ప, తమ ఎనిమిదేళ్ల చిన్నారితో కలిసి అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. సోమవారం రాత్రి ఈ దంపతుల మధ్య ఏదో విషయంపై గొడవ జరిగింది. అదికాస్త తీవ్రం కావడంతో శివరామ్ తన భార్య తలను నరికాడు, ఆ తర్వాత వంటగదిలో ఆమె మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేశాడు. పుష్ప స్వస్థలం కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా సాగర పట్టణం. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడైన భర్త శివరామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో భాగంగా గత కొంత కాలంగా ఈ దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నట్టు వెల్లడైంది.