Supreme Court: కేరళ, బెంగాల్ రాష్ట్రాల గవర్నర్లకు సుప్రీం నోటీసులు

by Shamantha N |
Supreme Court: కేరళ, బెంగాల్ రాష్ట్రాల గవర్నర్లకు సుప్రీం నోటీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: పలు బిల్లుల పెండింగ్ విషయంలో కేరళ(Kerala), పశ్చిమ బెంగాల్(West Bengal) గవర్నర్ కార్యాలయాలకు సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు జారీ చేసింది. గవర్నర్ల దగ్గరే బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు సుప్రీంకోర్టుని ఆశ్రయించాయి. దీనిపై సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేపీ పార్థివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ వ్యవహారంలో కేంద్రంతోపాటు గవర్నర్ కార్యదర్శులకు కూడా నోటీసు జారీ చేసింది. ఇక, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి పంపించాల్సిన బిల్లులపై ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్న గవర్నర్ల చర్యను సవాలు చేస్తూ రెండు రాష్ట్రాలు కోర్టుని ఆశ్రయించాయి. ఏడాదికి పైగా ఎనిమిది బిల్లులపై గవర్నర్లు ఆమోదం తెలపకుండా ఆలస్యం చేస్తున్నారని పేర్కొన్నాయి. ఆలస్యానికి గల కారణం తెలియజేయట్లేదని రెండు రాష్ట్రాలూ తమ పిటిషన్‌లలో తెలిపాయి.

మూడువారాల గడువు

కాగా, ఈవ్యవహారంలో సుప్రీంకోర్టు ఇరు రాష్ట్రాల గవర్నర్లకు నోటీసులు ఇచ్చింది. ఈ కేసుపై కోర్టులో వాదనలు జరిగిన ప్రతిసారీ కొన్ని బిల్లులు క్రియర్ అవుతాయని పిటిషనర్ తరఫు న్యాయవాది ఆరోపించారు. తమిళనాడులో కూడా ఇదే పరిస్థితి నెలకొందన్నారు. దీనిపై స్పందించేందుకు కేంద్రం, గవర్నర్‌లకు సుప్రీంకోర్టు మూడు వారాల గడువు ఇచ్చింది. ఉమ్మడి నోటీసును సమర్పించాలని పిటిషన్ వేసిన రాష్ట్రాలను కూడా కోర్టు ఆదేశించింది.



Next Story