Delhi Coaching Centre Deaths Case: నిందితులకు ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరణ

by Shamantha N |
Delhi Coaching Centre Deaths Case: నిందితులకు ఎదురుదెబ్బ.. బెయిల్ నిరాకరణ
X

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ కోచింగ్ సెంటర్ ఘటన కేసులో నిందితులకు ఎదురుదెబ్బతగిలింది. నలుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. గత నెలలో ఢిల్లీలోని రాజేంద్రనగర్ లోని సివిల్స్ కోచింగ్ సెంటర్ సెల్లార్ లోకి వరద చేరడంతో.. ముగ్గురు ఐఏఎస్ ఔత్సాహికులు చనిపోయారు. అయితే, ఈ కేసులో నలుగురు యజమానులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా.. బెయిల్ కోర్టుతూ నిందితులు రౌస్ అవెన్యూ కోర్టుని ఆశ్రయించారు. అయితే, కోర్టు వారి అభ్యర్థనను తిరస్కరించింది. "దర్యాప్తు ప్రాథమిక దశలో ఉంది. బెయిల్ ఇచ్చేందుకు మొగ్గు చూపడం లేదు." అని జడ్జి అంజు బజాజ్ చందనా పేర్కొన్నారు.

సీబీఐకి కేసు బదిలీ

ఆగస్టు 17న కోచింగ్ సెంటర్ నలుగురు జాయింట్ ఓనర్లు- పర్వీందర్ సింగ్, తాజీందర్ సింగ్, హర్విందర్ సింగ్, సరబ్ జిత్ సింగ్‌ల వాదనలను వింది. ఆ తర్వాత కోర్టు ఉత్తర్వులను రిజర్వ్ చేసింది. దానిపైనే శుక్రవారం తీర్పు వెలనురించింది. ఇకపోతే, ఢిల్లీ హైకోర్టు కోచింగ్ సెంటర్ మరణాలపై దర్యాప్తును పోలీసుల నుంచి సీబీఐకి బదిలీ చేసింది. దర్యాప్తుపై ప్రజలకు ఎలాంటి సందేహం లేకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామంది.

Advertisement

Next Story

Most Viewed