బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. కెనాల్ సమీపంలో శరీర భాగాలు గుర్తించిన పోలీసులు

by S Gopi |   ( Updated:2024-06-09 10:49:09.0  )
బంగ్లాదేశ్ ఎంపీ హత్య కేసు.. కెనాల్ సమీపంలో శరీర భాగాలు గుర్తించిన పోలీసులు
X

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనార్ హత్య కేసు దర్యాప్తునకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించారు. పశ్చిమ బెంగాల్ సీఐడీ ఆదివారం దక్షిణ 24 పరగణాస్ జిల్లాలోని కాలువ సమీపంలో శరీర భాగాలను స్వాధీనం చేసుకున్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. గాలింపు చర్యలను వేగవంతం చేసిన అధికారులు.. నేపాల్ పోలీసులు అరెస్టు చేసి భారత్‌కు అప్పగించిన కేసులో కీలక నిందితుడైన మహ్మద్ సియామ్ హుస్సేన్‌ను విచారించిన అనంతరం భాంగర్‌లోని కృష్ణమతి గ్రామంలో ఉన్న బాగ్జోల కాలువ ఒడ్డున మానవ ఎముకలను గుర్తించారు. వైద్యులతో పాటు ఫోరెన్సిక్ నిపుణుల సమక్షంలో గాలింపు చర్యలు చేపట్టగా, కాలువలో మనిషి ఎముకలు లభించాయి. ప్రస్తుతానికి వాటిని ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపించినట్టు అధికారుపు పేర్కొన్నారు. ఇతర శరీర భాగాల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు స్పష్టం చేశారు. ఇదివరకు బంగ్లాదేశ్ ఎంపీ శరీరమేనని భావిస్తున్న మాంసంపు ముద్దను హత్య జరిగిన అపార్టుమెంటు సెప్టిక్ ట్యాంకులోనే పోలీసులు గుర్తించిన సంగతి తెలిసిందే. ఎంపీని హత్య చేసి, శరీర భాగాలను ముక్కలుగా పారేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. కానీ, ఇప్పటివరకు కొన్నిటినీ సేకరించగా, అవి బంగ్లాదేశ్ అంపీవే అని నిర్ధారించడం కష్టంగా మారింది. దానికోసం డీఎన్ఏ పరీక్షలు నిర్వహిచడానికి సిద్ధమవుతున్నట్టు అధికారులు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed