అడ‌వి దారిలో రైలుకు ఎదురొచ్చిన ఏనుగు.. త‌ర్వాత ఏమైందో చూడండి!

by Sumithra |
అడ‌వి దారిలో రైలుకు ఎదురొచ్చిన ఏనుగు.. త‌ర్వాత ఏమైందో చూడండి!
X

దిశ‌, వెబ్‌డెస్క్ః దేశంలో కొండ‌ల మ‌ధ్య, అడ‌వి మార్గాల్లో నిర్మించిన ర‌హ‌దారులు, రైల్వే దారులు అంత సుర‌క్షితంగా ఉండ‌వు. అత్యంత వేగంగా వెళ్లినా, నెమ్మ‌దిగా వెళ్లినా అక్క‌డ ప్ర‌మాద‌మే! సాధార‌ణంగా న‌గర‌ల్లోనే రైలు వేగంగా వెళుతుంది. అలాంటిది, స్టాప్‌లే ఉండ‌ని అడివి మార్గంలో ఇంకెంత వేగంగా వెళుతుందో క‌దా! అలాంటి ఓ అడ‌వి మార్గంలో వెళుతున్న రైలుకు ఒక‌ అడవి ఏనుగు ఎదురొచ్చింది. అయితే, ఆ ఏనుగు ప్రాణాలను ఈ ట్రైన్ డ్రైవర్‌ ఎంతో చాక‌చ‌క్యంగా కాపాడాడు. ఈ వీడియోను అలిపుర్దౌర్‌ డివిజన్, N.F. రైల్వే అధికారిక ట్విట్టర్ ఖాతా అయిన‌ DRM APDJ ఈ వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోతో పాటు "#అలర్ట్ LP & ALP ఆఫ్ 15767 అప్ SGUJ-APDJ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ R.R. నిన్న 17.35 గంటలకు గుల్మా-సివోక్ మధ్య KM 23/1 వద్ద ఒక అడవి ఏనుగు ట్రాక్ దాటడాన్ని కుమార్ & S. కుందు హ‌టాత్తుగా గమనించి, వ‌న్య‌ప్రాణుల్ని కాపాడ‌టానికి, రైలు వేగాన్ని నియంత్రించే బ్రేక్ వేశాడు" అని వివరణాత్మక క్యాప్షన్‌ను పంచుకున్నారు. రైలులోపల నుండి తీసిన ఈ వీడియోను చూసిన నెటిజ‌న్లు డ్రైవ‌ర్‌ను తెగ‌ మెచ్చుకుంటున్నారు. మీరూ చూడండి..

Advertisement

Next Story

Most Viewed