Uttar Pradesh: ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్

by S Gopi |
Uttar Pradesh: ప్రైవేట్ రంగం ఉద్యోగాల్లో రిజర్వేషన్‌ను అమలు చేయాలని కేంద్ర మంత్రి డిమాండ్
X

దిశ, నేషనల్ బ్యూరో: ప్రైవేట్ రంగంలోని నాలుగో తరగతి ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్ ఆదివారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. 'ప్రైవేటు రంగంలో ఔట్ సోర్సింగ్ ద్వారా నాల్గవ తరగతి పోస్టుల్లో జరిగే నియామకాల్లో రిజర్వేషన్ ప్రక్రియను పాటించలేదు. అణగారిన వర్గాల ప్రజలు నాల్గవ తరగతి ఉద్యోగాలు పొందేవారు. ఈ పోస్టులపై ఔట్ సోర్సింగ్ ద్వారా రిక్రూట్‌మెంట్ చేసినప్పటి నుంచి, రిజర్వేషన్ చట్టాన్ని అనుసరించడంలేదని ' ఆమె విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. కాబట్టి ప్రైవేటు రంగంలో ఔట్ సోర్సింగ్ ద్వారా జరిగే నాల్గవ తరగతి ఉద్యోగాల్లోని అన్ని నియామకాల్లో రిజర్వేషన్లు పాటించాలని మా పార్టీ(ఆప్నాదళ్ సోనేలాల్) కోరుకుంటోందని ఆమె అన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం సమర్పించిన ఉత్తరప్రదేశ్ నాజుల్ ఆస్తి (ప్రజా ప్రయోజనాల నిర్వహణ, వినియోగం) బిల్లు-2024 'అనవసరం' అని అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో యూపీలో 10 స్థానాలకు జరగనున్న ఉప ఎన్నికల్లో ఎన్డీఏ అన్ని స్థానాల్లోనూ పోటీ ఏస్తుందని ఆమె స్పష్టం చేశారు. అలాగే, కులగణన చేయాలని తమ పార్టీ కూడా డిమాండ్ చేస్తోందన్నారు. కులాల లెక్క లేకుండా ప్రయోజనాలను అందించే ప్రక్రియలో ముందుకు సాగలేమని ఆమె వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed