ఆగస్ట్ 17న దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్

by M.Rajitha |
ఆగస్ట్ 17న దేశవ్యాప్తంగా వైద్యసేవలు బంద్
X

దిశ, వెబ్ డెస్క్ : కోల్‌కతాలోని ఆర్జీ మెడికల్ కాలేజీలో మహిళా ట్రైనీ డాక్టర్ అత్యాచార, హత్య ఘటనకు నిరసనగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్(ఐఎంఏ) కీలక నిర్ణయం తీసుకుంది. వైద్యురాలిపై జరిగిన దారుణ ఘటనను నిరసిస్తూ ఆగస్ట్ 17న దేశవ్యాప్తంగా నాన్ ఎమర్జెన్సీ మెడికల్ సేవలు బంద్ చేయాలని ఐఎంఐ నిర్ణయించింది. దీని ఫలితంగా దేశవ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో అత్యవసర సేవలు తప్ప ఇతర వైద్య సేవలు 24 గంటల పాటు నిలిచిపోనున్నాయి. డాక్టర్లంతా ఈ నిరసనలో తప్పకుండా పాల్గొనాలని ఐఎంఏ సూచించింది. శనివారం ఉదయం 6 గంటల నుండి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు దేశవ్యాప్తంగా వైద్యులు వైద్య సేవలు బహిష్కరించనున్న నేపథ్యంలో సాధారణ వైద్య సేవలు నిలిచి పోనున్నాయి.

Advertisement

Next Story

Most Viewed